నవంబర్ నుంచి బాల‌య్య‌, బోయ‌పాటి సినిమా?

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Balakrishna Boyapati Movie To Begin From November, Balakrishna Boyapati film has a date to start, Exciting News on Balayya-Boyapati Film, Balakrishna special request to Boyapati Srinu, Balakrishna Boyapati Movie Shooting Starts From November

నటసింహ నందమూరి బాలకృష్ణకు కలిసొచ్చిన దర్శకుల్లో యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఒకరు. గ‌తంలో ఈ ఇద్దరి కలయికలో ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కిన సంగ‌తి తెలిసిందే. అయితే… గత కొంత కాలంగా ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ దిశ‌గా అడుగులు ప‌డుతున్న‌ట్టు స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు… బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ‘జయ జానకి నాయక’ చిత్రాన్ని నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి… ఇప్పుడు బాలయ్య, బోయపాటి సినిమాని కూడా నిర్మించనున్నారని టాలీవుడ్ టాక్. అలాగే… ఈ ఏడాది నవంబర్‌లో చిత్రాన్ని ప్రారంభించి… వచ్చే సంవత్సరం వేసవిలో విడుదల చేయాల‌ని కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

కాగా, ప్రస్తుతం బాలకృష్ణ… కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రూలర్’ (ప్రచారంలో ఉన్న పేరు)లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌… డిసెంబర్ 21న విడుద‌ల కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 13 =