14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రైతు సమస్యల నేపథ్యం లో ఎమోషనల్ డ్రామా శ్రీకారం మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దానితో పాటు 96 తమిళ సూపర్ హిట్ మూవీ రీమేక్ కూడా చేస్తున్నాడు. 96 సినిమా అయిపోయిన తర్వాత శ్రీకారం సినిమా చేయనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ రెండు సినిమాలు ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టాడు శర్వా. శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్.ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మాతలుగా ఈ సినిమా రూపొందనుంది. శ్రీకార్తీక్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఈరోజు చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. షూటింగ్ కూడా ఈ రోజు నుండే ప్రారంభమైంది.
కాగా ఈ సినిమాలో `పెళ్ళిచూపులు` ఫేమ్ రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా… నాజర్, వెన్నెలకిషోర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ సారంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విడదీయలేని స్నేహం, ప్రేమ అనే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్న ఈ సినిమాను… వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
నటీనటులు:
శర్వానంద్, రీతూవర్మ, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: శ‌్రీకార్తీక్
నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్.ప్రభు
బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
డైలాగ్స్: తరుణ్ భాస్కర్
మ్యూజిక్: జాక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
ఎడిటర్: శ్రీజిత్ సారంగ్
ప్రొడక్షన్ డిజైనర్: ఎన్.సతీశ్ కుమార్
కాస్ట్యూమ్స్ స్టైలిస్ట్ :పల్లవి సింగ్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: