బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘బద్లా’ ను తమిళ్ లో ‘నేర్కొండ పార్వాయ్’ పేరుతో రీమేక్ చేసి ఇక్కడ కూడా హిట్ కొట్టాడు తమిళ్ తాలా అజిత్. హెచ్ వినోద్ డైరెక్టర్ గా, బోనీ కపూర్, అజిత్ కాంబినేషన్ లో ఈ నెల 18వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో మరో సినిమా కూడా తెరకెక్కబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జారుకుంటున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ లో ఈ సినిమా ను సెట్స్ పైకి తీసుకెళ్లే యోచనలో ఉన్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో వార్త కోలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. అజిత్ కు విలన్ గా ఈ సినిమాలో బాలీవుడ్ యాంగ్రీ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తున్నాడు. దీనితో ఈ సినిమాలో కూడా అజయ్ నటిస్తే బావుంటుందని అనుకుంటున్నారట. మరి అజయ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో?లేదో? చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























