ముంబై లో దర్బార్ మూవీ ఆఖరి షెడ్యూల్

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Rajinikanth Darbar Movie Last Schedule In Mumbai, Rajinikanth and Nayanthara back in Mumbai for Darbar, Darbar Shooting in Mumbai, Darbar Movie Latest News, Darbar Movie Final Schedule In Mumbai, Rajinikanth flies back to Mumbai for Darbar

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ , నయనతార జంటగా AR మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ దర్బార్ తమిళ మూవీ 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ లో నివేత థామస్, ప్రతీక్ బబ్బర్, యోగి బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రజనీకాంత్ 167 వ మూవీ గా రూపొందుతున్న దర్బార్ మూవీ షూటింగ్ ఆఖరి షెడ్యూల్ ముంబైలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తో దర్బార్ మూవీ రెండు సాంగ్స్ మినహా షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. చెన్నై లో రూపొందే సెట్స్ లో ఆ సాంగ్స్ చిత్రీకరణ జరుపుకోనున్నాయి. 1992 సంవత్సరం పాండ్యన్ మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా నటించిన రజనీకాంత్ తిరిగి ఇన్ని సంవత్సరాల తరువాత దర్బార్ మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం. ఫస్ట్ లుక్ పోస్టర్, సెకండ్ లుక్ పోస్టర్స్ తో ఆకట్టుకున్న దర్బార్ మూవీ పై అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =