దిగ్గజాలనే నడిపించిన సుజీత్ కు ‘సాహో’

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Telugu FilmNagar Says Saaho To Sujeeth, Saaho To Sujeeth Says Telugu Filmnagar, Saaho Movie Latest News, Prabhas Saaho, Saaho Review,Saaho Movie Review,Saaho Telugu Movie Review, Prabhas Saaho

నిండా ముప్పై ఏళ్ళు లేవు.. తీసింది కేవలం ఒక్క సినిమా.. ఒక్క సినిమా తో బాహుబలిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. అంటే ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది మనం చెప్పడం చాలా ఈజీగా చెప్పొచ్చు కానీ.. దానికి సుజీత్ పడిన కష్టం ఏంటో అతనికే తెలుస్తుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. తనకు సినిమాల పట్ల ఉన్న అంకిత భావమే సుజిత్ ను ఇప్పుడు ఈ స్థాయిలో కూర్చోబెట్టింది అని చెప్పొచ్చు. మొదట.. యూట్యూబ్ ఛానెల్‌పెట్టి.. షార్ట్ ఫిలిమ్స్ తీసి ఆ తర్వాత యువీ క్రియేషన్స్ పై ‘రన్ రాజా రన్’ సినిమాను తీసి మొదటి సినిమాతో హిట్ కొట్టి శర్వాకి లైఫ్ నిచ్చింది. ఊహించని లాభాలు తెచ్చింది. సుజిత్‌పై కాలుక్యులేషన్స్ పెంచింది. సైమా అవార్డుల ఫంక్షన్లో ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా క్యాటగిరీ కింద -యువీ క్రియేషన్స్ బ్యానర్ పేరు నిలబెట్టింది. దానితో అప్పుడే ప్రభాస్ తో చేసే అవకాశం దక్కింది సుజీత్ కు. అయితే ఆ తర్వాత బాహుబలి తీయడం.. బాహుబలితో ప్రభాస్ రేంజ్ మారిపోవడంతో.. చిన్న సినిమా కాస్త పెద్ద సినిమా అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సాహూ సినిమా కు పడిన కష్టం..ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న ప్రభాస్.. సుజిత్ చెప్తూనే వున్నారు. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే… ఇంత పెద్ద సినిమాకు సుజీత్ ను నమ్మడం. మరో విషయం ఏంటంటే.. సాహో కాస్ట్ అండ్ క్రూ చూస్తే ఎంతోమంది దిగ్గజాల్లో తనే జూనియర్ చెప్పొచ్చు. టెక్నీషియన్లంతా మదీ, సాబుసిరిల్, శేఖర్ ప్రసాద్, కమల్ కణ్ణన్, జిబ్రాన్.. ఆర్టిస్టులంతా ప్రభాస్, శ్రద్ధాకఫూర్, జాకీష్రాఫ్, నీల్‌నితిన్ ముఖేష్, ఎ విజయ్, చుంకీ పాండే, మందిరా బేడీ, లాల్, ముఖేష్ మంజ్రేకర్ ఇలా అందరూ దిగ్గజాలు. అయినా సుజిత్ తడబడలేదు. తననుకున్న బాటలో నడుస్తుంటే -కుర్రాడి కష్టాన్ని చూస్తూ దిగ్గజాలంతా వెనకే నడిచారు. నిర్మాతలు సైతం ‘రన్ సుజిత్ రన్’ అంటూ నోట్లు పట్టుకుని వెనకాల పరిగెత్తారు.

అంతేనా ఈ సినిమా కోసం ప్రత్యేక వాహనాలు తెప్పించాడు. ఎప్పుడూ చూడని ఆయుధాలను డిజైన్ చేయించాడు. అంతర్జాతీయ స్థాయిలో సీజీ సాంకేతికతను వాడాడు. అంతర్జాతీయ నిపుణులనూ వినియోగించాడు. ఇవన్నీ చూసిన తర్వాత టెక్నీకల్ గా సుజీత్ ఎంత ఎక్స్పర్ట్ అన్న విషయమో అర్ధమవుతుంది. రెండేళ్లపాటు ఇంతమంది ఇన్ని రకాలుగా పడిన కష్టం -నాలుగు భాషల స్క్రీన్స్ మీద రేపు ఆవిష్కృతం కానుంది. తెలుగు సినిమా చరిత్రను తిరగరాసేంత బలంతో రెండేళ్ల కష్టం సాహో రేపు థియేటర్లకొస్తోంది. సో చూడండి.. ఎంజాయ్ చేయండి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.