యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సాహో’. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ రూపొందిన ఈ ట్రైలింగ్వల్ యాక్షన్ ఎంటర్‌టైనర్… ఈ రోజు (ఆగస్టు 30) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంతేకాదు… ఈ సినిమాతో ప్రభాస్ నేరుగా బాలీవుడ్‌లోనూ అడుగుపెడుతుండడం విశేషం. అలాగే… తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్నారు కూడా. ఆసక్తికరమైన అంశమేమిటంటే… ప్రభాస్ కంటే ముందు టాలీవుడ్‌కి చెందిన పలువురు అగ్ర కథానాయకులు హిందీనాట తమదైన ముద్ర వేశారు. మూడు తరాలకు చెందిన ఆ అగ్ర కథానాయకుల వివరాల్లోకి వెళితే…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహానటుడు నందమూరి తారక రామారావు: యన్టీఆర్ కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రాల్లో ‘పాతాళభైరవి’ ఒకటి. అలాంటి సినిమా హిందీ వెర్షన్‌తో బాలీవుడ్‌లో తొలి అడుగులు వేసిన యన్టీఆర్… ఆపై ‘చండీరాణి’, `బ్రహర్షి విశ్వామిత్ర`తో సందడి చేశారు.
లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు: ‘సువర్ణ సుందరి’ హిందీ వెర్షన్‌తో ఏయన్నార్ హిందీనాట సందడి చేశారు. అదే టైటిల్‌తో రిలీజైన ఆ సినిమా అక్కడా విజయకేతనం ఎగురవేసింది.
మెగాస్టార్ చిరంజీవి: తెలుగు బ్లాక్‌బస్టర్ `అంకుశం`కి రీమేక్‌గా రూపొందిన ‘ప్రతిబంధ్’తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు చిరు. ఆ తరువాత `ఆజ్ కా గూండారాజ్’, ‘ది జెంటిల్‌మాన్’ సినిమాలతో ఉత్తరాదిన సందడి చేసారు.
‘కింగ్’ నాగార్జున: తన కెరీర్‌ని మేలి మలుపు తిప్పిన ‘శివ’కి హిందీ వెర్షన్‌గా తెరకెక్కిన `షివ`తో హిందీనాట తొలి అడుగులు వేశారు నాగ్. ఆపై ‘ఖుదాగవా’, ‘ద్రోహి’, ‘క్రిమినల్’, ‘Mr.బేచారా’, ‘అంగారే’, ‘జఖ్మ్’, ‘అగ్నివర్ష’, ‘LOC: కార్గిల్’ చిత్రాలతో సందడి చేశారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మల్టీస్టారర్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో కీలక పాత్ర పోషిస్తున్నారు నాగ్. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రం రిలీజ్ కానుంది.
‘విక్టరీ’ వెంకటేష్: అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలచిన తన చిత్రం `చంటి`కి హిందీ రీమేక్‌గా తెరకెక్కిన ‘అనారి’తో హిందీనాట ఎంట్రీ ఇచ్చారు వెంకీ. అనంతరం ‘తక్‌దీర్ వాలా’ (`యమలీల` రీమేక్)తో మురిపించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్: బిగ్ బి అమితాబ్ బచ్చన్ క్లాసిక్ హిట్ ‘జంజీర్’ రీమేక్‌తో రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
ఇలా… తెలుగు చిత్ర పరిశ్రమలోని మూడు తరాల అగ్ర కథానాయకులు ఉత్తరాది ప్రేక్షకులను అలరించడం విశేషం. వీరిలో సింహభాగం కథానాయకులు తొలి చిత్రాలతో ఘనవిజయాలు అందుకున్నారు. ప్రభాస్ కూడా అదే ఫీట్‌ని రిపీట్ చేయాలని ఆశిద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: