శ్రీముఖిని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Srimukhi A Victim Of Over Reacting Social Media, Sreemukhi Bigboss, Are They Targeting Sreemukhi Wantedly, Wantedly Sreemukhi Targeted, Sreemukhi Latest News,Bigg Boss Telugu Season 3

బిగ్ బాస్ 3 రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని వివాదాలు ఎదురైనా కూడా ఈ షో మాత్రం సక్సెస్ ఫుల్ గా నడుస్తూనే ఉంది. ఇక ఈ షో లో వన్ ఆఫ్ డ్ కంటెస్టెంట్ అయిన శ్రీముఖి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెర యాంకర్ గా మంచి పేరు సంపాదించుకున్న శ్రీముఖి అప్పుడప్పుడు వెండి తెరపై కూడా మెరుస్తూనే ఉంది. ప్రస్తుతం తన అల్లరితో.. తన యాక్టీవ్ నెస్ తో బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ప్రస్తుతం శ్రీముఖి పై తప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనితో నెటిజన్లు శ్రీముఖిపై మండిపడుతున్నారు. నాగార్జున ఆమెని ఒక్క మాట కూడా అనకపోవడం, షోలో ఆమె నెగెటివ్ యాంగిల్ కనిపించకుండా కూడా ఎడిట్ చేస్తున్నారని ఇలా చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతే కాదు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ అనే ఆంగ్ల పత్రికలో కూడా ఆమెకు వ్యతిరేకంగా ఓ కథనం వచ్చింది.

దీనితో శ్రీముఖి పై అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాస్తున్నారని ప్రముఖ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ అనే దినపత్రికపై శ్రీముఖి బంధువులు జూబ్లీహిల్స్ పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. గత రెండు వారాల నుండి ఈ వార్తలు మరింత ఎక్కువగా వస్తుండడంతో కంప్లైంట్ ఇవ్వక తప్పలేదని అన్నారు. సోషల్ మీడియా లో ఫేక్ అకౌంట్లు ద్వారా శ్రీ ముఖి పై కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని తెలిపారు.

నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ లలో శ్రీముఖి ఫస్ట్ ప్లేసులో ఉంటుదని బిగ్ బాస్ చూసిన ఎవరికైనా అర్ధమవుతుంది. తాను గేమ్ ఆడే విధానం కానీ.. గేమ్ లో తను ప్లే చేసే స్ట్రాటజీలు కానీ సూపర్ అనేలా ఉంటాయి. ఈ విషయం హౌస్లో ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. గేమ్ లో భాగంగా తను జోక్ గా రాహుల్ ని అలా అన్న విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. దాన్ని బేస్ చేసుకొని శ్రీముఖి వర్ణ వివక్ష చూపుతుంది అని అనడం.. తప్పుడు ప్రచారం చేయడం చూస్తుంటే కావాలనే శ్రీముఖి ని టార్గెట్ చేస్తున్నట్టు అర్ధమవుతుంది. అలా అనుకుంటే శ్రీముఖి ని సైకో అని.. గేమ్ కోసం ఏదైనా చేస్తుందని.. ఇంకా చాలానే అన్నారు మిగిలిన కంటెస్టెంట్లు. అది బిగ్ బాస్ హౌస్ ఒకర్ని ఒకరు తిట్టుకోవడం.. కొట్టుకోవడం.. ప్రేమను పంచుకోవడం ఇలా అన్నీ జరుగుతుంటాయి. షో ని షోలా చూడకుండా ఇలా శ్రీముఖి ని టార్గెట్ చేయడం మాత్రం తప్పని పలువురు అభిప్రాయపడుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fourteen =