గత చిత్రాలతో కెరీర్ బెస్ట్ హిట్స్ అందుకున్న కొందరు స్టార్ హీరోలు… 2019 చివరి నాలుగు నెలల్లో భారీ అంచనాల మధ్య తమ నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌తో సందడి చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్: ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజాన్’ వంటి కెరీర్ బెస్ట్ హిట్స్ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో’. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ రోజు (శుక్రవారం) తెరపైకి వచ్చింది. గత చిత్రాల తరహాలో ఈ సినిమా కూడా సంచలన విజయం సాధిస్తుందేమో చూడాలి..
మెగాస్టార్ చిరంజీవి: ‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చి మరో బ్లాక్‌బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి… ఈ అక్టోబర్ 2న ‘సైరా నరసింహారెడ్డి’తో పలకరించనున్నారు. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన `సైరా` తన కెరీర్‌లో మరో మెమరబుల్ మూవీగా నిలుస్తుందేమో చూడాలి.
‘విక్టరీ’ వెంకటేష్: ఈ ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్ 2’ రూపంలో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వెంకీ… ఈ దీపావళికి ‘వెంకీమామ’గా రానున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్: ‘ఎఫ్ 2’తో కెరీర్ బెస్ట్ హిట్‌ని సొంతం చేసుకున్న వరుణ్… ప్రస్తుతం ‘వాల్మీకి’లో నటిస్తున్నాడు. సెప్టెంబర్ 20న ఈ సినిమా తెరపైకి రానుంది.
యువ సామ్రాట్ నాగచైతన్య: ఈ ఏడాది సమ్మర్‌లో విడుదలైన ‘మజిలీ’తో కెరీర్ బెస్ట్ అందుకున్న చైతు… ప్రస్తుతం ‘వెంకీమామ’తో బిజీగా ఉన్నాడు. ఈ దీపావళికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్లలో సందడి చేయనుంది.
మరి… కెరీర్ బెస్ట్ హిట్స్ (కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్స్) అనంతరం వస్తున్న ఈ స్టార్స్… అప్ కమింగ్ మూవీస్‌తోనూ ఆ మ్యాజిక్‌ని కొనసాగిస్తారేమో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: