
ట్యాగ్ · 343 కథనాలు · పేజీ 14


జయలలిత బయోపిక్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో

ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ పై మహేష్ బాబు స్పందన

విజయ్‌కి జోడీగా కేథరిన్ త్రెసా?

స‌్టూడెంట్ పాత్రలో ప్రభాస్?

`పేట` నాయికలకు సంక్రాంతి సెంటిమెంట్

ప్రాణ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇలా అయితే సినిమా ఇండస్ట్రీ బతికి బట్ట కట్టేదెలా
నిన్నంటే నిన్న రిలీజ్ అయింది "ఎన్టీఆర్- కథానాయకుడు". సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చింది. బయోపిక్ కావటంతో ఓపెనింగ్స్ గొప్పగా లేకపోయినప్పటికీ "అద్భుతం" అనే మౌత్ టాక్ స్ప్రెడ్ అవటంతో సాయంత్రానికల్లా సినిమా మీద గొప్ప పాజిటివ్ రిపోర్ట్ వైరల్ అయింది. అన్ని ప్రాంతాల నుండి మంచి రిపోర్ట్స్ రావటంతో దర్శక నిర్మాతలు, యూనిట్ మెంబర్స్, నందమూరి అభిమానులు, పరిశ్రమ ప్రముఖులు అందరూ ఆనందంగా ఉన్నారు. కానీ సాయంత్రానికల్లా "ఎన్టీఆర్- కథానాయకుడు" నెట్ లో వచ్చేసింది. అంటే థియేటర్లో సినిమా చూసి ఇంటికి వచ్చి రివ్యూస్, పబ్లిక్ టాక్ చూద్దామనుకునే సరికే సినిమా నెట్ లో కనిపించటం చూసి షాక్ అవ్వడం ప్రేక్షకుడి వంతయింది.

ఎన్టీఆర్ - కథానాయకుడు రివ్యూల పై రివ్యూ
"సమీక్ష"అనే శీర్షిక కింద ఒక సినిమా తాలూకు బాగోగులను, మంచి చెడ్డలను విశ్లేషించి, విమర్శించటం, అభినందించడం ఒక చక్కని ప్రక్రియ. ఈ సమీక్షలు కొన్ని సందర్భాల్లో కొందరికి నచ్చవచ్చు.. కొందరికి నచ్చకపోవచ్చు. సినిమా మీద తమ అభిప్రాయాన్ని సమీక్ష రూపంలో చెప్పే హక్కు సమీక్షకులకు ఎలా ఉంటుందో... ఆ సమీక్షలను సమీక్షించే హక్కు కూడా అందరికీ ఉంటుంది. అయితే బాగుందని రాసినప్పుడు 'థాంక్యూ' అని ఒక్క మాట కూడా చెప్పని వాళ్లు బాగోలేదని రాసినప్పుడు పచ్చి బూతుల వీరంగాలు సృష్టిస్తారు. ఇది సమీక్షకులకు- సినీ సంబంధీకులకు- అభిమానులకు మధ్య అనునిత్యం జరిగే అంతర్యుద్ధం. రివ్యూలు, సమీక్షకుల హక్కులు, పాఠకుల, సినిమా సంబంధీకుల…

జయలలిత బయోపిక్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమ బయోపిక్ మూవీస్ రూపొందించడం లో నిమగ్నమై ఉంది. బయోపిక్ మూవీస్ సక్సెస్ రేట్ అధికంగా ఉండటం తో అన్ని భాషల నిర్మాతలు బయోపిక్ మూవీస్ నిర్మాణానికి మొగ్గు చూపుతున్నారు. సక్సెస్ ఫుల్ సినీ హీరోయిన్, దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ మూవీ కి కోలీవుడ్ లో డిమాండ్ ఉంది. దర్శకురాలు ప్రియదర్శిని రూపొందించే ది ఐరన్ లేడీ తో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ అనౌన్స్ అయ్యాయి.

బాలకృష్ణ ‘పెద్దన్నయ్య’కు 22 ఏళ్ళు
నటసింహ నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం పోషించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించాయి. ఆ చిత్రాలలో `పెద్దన్నయ్య` (1997) ఒకటి. `వంశానికొక్కడు` (1996) వంటి విజయవంతమైన చిత్రం తరువాత శరత్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా ఇది. సంక్రాంతి సీజన్‌లోనే రిలీజైన ఈ రెండు కుటుంబ కథా చిత్రాలూ మంచి విజయం సాధించాయి. కుటుంబ విలువలకు పెద్దపీట వేసిన ఈ చిత్రాన్ని రామకృష్ణ హార్టి కల్చరల్ సినీ స్టూడియోస్ పతాకంపై బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. బాలయ్యకి జోడీగా రోజా, ఇంద్రజ నటించిన ఈ సినిమాలో అచ్యుత్, రాజ్ కుమార్…

మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ `చంటి`కి 27 ఏళ్ళు
సీనియర్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్‌కు ఉన్న ట్రాక్ రికార్డే వేరు. తన తరం కథానాయకులలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న స్టార్ తనే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాదు... వెంకీ హీరోగా నటించిన చిత్రాలు దాదాపుగా మ్యూజికల్ హిట్సే. అలాంటి మ్యూజికల్ హిట్స్‌లో `చంటి`ని ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. తమిళ చిత్రం `చిన తంబి` ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా... ఇళయరాజా స్వరసారథ్యంలో రూపొంది మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలచింది. ఇందులోని ప్రతీ పాట ఆబాలగోపాలాన్ని అలరించింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ అధినేత…

ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ పై మహేష్ బాబు స్పందన
నందమూరి బాలకృష్ణ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు గా రూపొందిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ జనవరి 9వ తేదీ రిలీజయి హిట్ టాక్ తో విజయపథం లో దూసుకుపోతుంది. ఈ మూవీ చూసిన చిత్ర ప్రముఖులు తమ స్పందన తెలియజేశారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ పై తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలిపారు.

విజయ్‌కి జోడీగా కేథరిన్ త్రెసా?
`చమ్మక్ చల్లో` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన కేరళకుట్టి కేథరిన్ త్రెసా. ఆ తరువాత `ఇద్దరమ్మాయిలతో`, `పైసా`, `ఎర్రబస్సు`, `రుద్రమదేవి` సినిమాల్లో సందడి చేసినా... అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన `సరైనోడు` చిత్రంతోనే బ్రేక్ అందుకుంది కేథరిన్. ఇందులో ఎం.ఎల్.ఎ క్యారెక్టర్‌లో తన యాక్టింగ్‌తో, గ్లామర్‌తో మెప్పించింది. ఆ తరువాత `గౌతమ్ నంద`, `జయజానకి నాయక` (స్పెషల్ సాంగ్), `నేనే రాజు నేనే మంత్రి`లో తన గ్లామర్‌తో అలరించింది. `నేనే రాజు నేనే మంత్రి` తరువాత మరో తెలుగు సినిమాకి సంతకం చేయని కేథరిన్.. తమిళ్, మలయాళ చిత్రాలతో…

స‌్టూడెంట్ పాత్రలో ప్రభాస్?
`బాహుబలి` స్టార్ ప్రభాస్... ప్రస్తుతం రెండు త్రిభాషా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న `సాహో` ఈ ఏడాది ఆగస్టు 15న తెరపైకి రానుండగా... `జిల్` రాధాకృష్ణ రూపొందిస్తున్న పేరు నిర్ణయించిన పిరియాడిక్ లవ్ స్టోరీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇదిలా ఉంటే... `జిల్` రాధాకృష్ణ చిత్రంలో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే... ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో స్టూడెంట్‌గా సందడి చేయనున్నాడట ఈ యంగ్ రెబల్ స్టార్. కథలో భాగంగా వచ్చే ఈ సన్నివేశాలు…

`పేట` నాయికలకు సంక్రాంతి సెంటిమెంట్
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా `పేట`. `బాషా` తరువాత దాదాపు 24 ఏళ్ళ అనంతరం సంక్రాంతికి విడుదలవుతున్న సూపర్ స్టార్ సినిమా ఇదే కావడంతో... ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో రజనీకి జోడీగా తొలిసారిగా సీనియర్ హీరోయిన్లు సిమ్రాన్, త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన విషయమేమిటంటే... ఈ ఇద్దరు నాయికలకు సంక్రాంతి సెంటిమెంట్ బలంగానే ఉంది. సిమ్రాన్ కెరీర్ ని మలుపు తిప్పిన తెలుగు చిత్రాలు `సమరసింహా రెడ్డి` (1999), `కలిసుందాం...రా!`(2000), `నరసింహనాయుడు`(2001)... మూడు వరుస సంవత్సరాల్లో…

2018 లాగానే 2019 లో టాలీవుడ్ కు ప్రారంభ విజయాన్ని అందించిన బాలకృష్ణ
2018 సంవత్సర ప్రారంభంలో “జై సింహా ” హిట్ ద్వారా టాలీవుడ్ కు తొలి విజయాన్ని అందించిన నందమూరి నటసింహం బాలకృష్ణ 2019 లో కూడా తొలి విజయాన్ని నమోదు చేసుకుని టాలీవుడ్ కు మరో శుభారంభాన్నిచ్చారు. ఈ రోజు విడుదలైన "ఎన్టీఆర్ కథానాయకుడు" సూపర్ హిట్ అనే టాక్ ను సొంతం చేసుకోవడంతో బాలయ్య వరుసగా రెండవసారి సంక్రాంతి స్టార్ గానే కాకుండా "ది బెస్ట్ బిగినర్ ఆఫ్ ద ఇయర్" గా నిలిచారు.
యన్టీఆర్ ‘వరకట్నం’కు 50 ఏళ్ళు
మహానటుడు యన్టీఆర్ కథానాయకుడిగానే కాదు దర్శకుడిగానూ తెలుగునాట తనదైన ముద్ర వేశారు. `సీతారామకళ్యాణం`, `గులేబకావళి కథ`, `శ్రీకృష్ణ పాండవీయం` చిత్రాలతో దర్శకుడిగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న యన్టీఆర్... స్వీయదర్శకత్వంలో రూపొందించిన నాలుగో చిత్రం `వరకట్నం`. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు... కథ, స్క్రీన్‌ప్లేను కూడా అందించారాయన. వరకట్నం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో యన్టీఆర్ సరసన కృష్ణకుమారి కథానాయికగా నటించగా... సావిత్రి, సత్యనారాయణ, నాగభూషణం, మిక్కిలినేని, రేలంగి, పద్మనాభం, సూర్యకాంతం, చంద్రకళ, హేమలత తదితరులు ఇతర ముఖ్యపాత్రలను…
సంక్రాంతి సీజన్‌లో తొలిసారిగా వస్తున్నారు
తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి. అలాంటి ఈ సీజన్‌లో విడుదలయ్యే సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఈ ఏడాది కూడా మూడు స్ట్రయిట్ ఫిల్మ్స్ సెల్యులాయిడ్ పై సందడి చేయనున్నాయి. ఆ చిత్రాలే `యన్.టి.ఆర్. కథానాయకుడు`, `వినయ విధేయ రామ`, `ఎఫ్ 2`. ఆసక్తికరమైన విషయమేమిటంటే... ఈ చిత్రాల్లో నటించిన కొంతమంది నటీనటులతో పాటు దర్శకులకు కూడా సంక్రాంతి సమయంలో సందడి చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఎన్టీఆర్ అనే నట దిగ్గజానికి ఘటించిన ఘన నివాళి "ఎన్టీఆర్- కథానాయకుడు"
అందుకే రెగ్యులర్ సినిమాలకు ఇచ్చే ర్యాంకులు- రేటింగులు ఇలాంటి అరుదైన ప్రయత్నానికి ఇవ్వటం, ప్లస్ లు మైనస్ లు అంటూ సమీక్షల పేరున పోస్టుమార్టాలు చేయటం సమంజసం కాదని భావిస్తూ - ఇది ఆ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, దివంగత నటదిగ్గజం ఎన్టీ రామారావుకు సమర్పించిన ఘన నివాళిగా భావిస్తూ యూనిట్ మొత్తానికి శుభాభినందనలు పలుకుతుంది "దతెలుగుఫిలింనగర్.కామ్"

విజయ్ దేవరకొండ సినిమాల రీమేక్స్‌లో అన్నదమ్ములు
వరుస విజయాలతో తెలుగునాట యూత్ ఐకాన్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ముఖ్యంగా `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం` ఘనవిజయాలతో టాలీవుడ్‌లో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో `డియర్ కామ్రేడ్`తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ హిట్ చిత్రాలకు ఇతర భాషల్లోనూ రీమేక్ రైట్స్ పరంగా మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య `అర్జున్ రెడ్డి` రీమేక్‌పై గట్టిపోటీ నెలకొనగా... ఇప్పుడు `గీత గోవిందం` రీమేక్ వెర్షన్స్ పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే... ఈ రెండు సినిమాలూ హిందీలోనూ తెరకెక్కుతుండగా... `అర్జున్ రెడ్డి` రీమేక్…

చిరంజీవి ‘దొంగమొగుడు’కి 32 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం పోషించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అలాంటి చిత్రాలలో... ‘దొంగమొగుడు’ ఒకటి. చిరు హీరోగా పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన ఎ.కోదండరామిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యండమూరి వీరేంద్రనాథ్ రచించిన `నల్లంచు తెల్లచీర` నవల ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ఎస్.పి.వెంకన్నబాబు నిర్మించారు. మాధవి, రాధిక, భానుప్రియ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో... ఇతర ముఖ్య పాత్రల్లో జయంతి, రంగనాథ్, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, చరణ్‌రాజ్, సుత్తి వేలు దర్శనమిచ్చారు…

రామ్ చరణ్ ‘నాయక్’కు ఆరేళ్ళు
యాక్షన్ చిత్రాలకు తన మార్కు వినోదాన్ని జోడిస్తూ... తెలుగు ప్రేక్షకులని అలరించిన దర్శకులలో వి.వి.వినాయక్ ఒకరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘నాయక్’ కూడా ఇలానే యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొంది ఆకట్టుకుంది. చరణ్ తొలిసారి ద్విపాత్రాభినయం పోషించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, అమలా పాల్ కథానాయికలుగా నటించారు. ప్రదీప్ రావత్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, దేవ్ గిల్, సుధ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించగా... అందాల భామ ఛార్మి ఐటెమ్ సాంగ్‌లో కనువిందు చేసింది. యువ సంగీత సంచలనం ఎస్.ఎస్.థమన్…
పడి పడి లేచె మనసు, అంతరిక్షం క్లోజింగ్ కలెక్షన్స్
క్రిస్మస్ పండుగ సందర్భంగా పలు సినిమాలు విడుదలై థియేటర్ల వద్ద సందడి చేసిన సంగతి తెలిసిందే. వాటిలో పడి పడి లేచె మనసు, అంతరిక్షం సినిమాలు కూడా ఉన్నాయి. సినిమా రిలీజ్ నుండి మంచి హైప్ తెచ్చుకున్న ఈసినిమాలు రిలీజ్ తరువాత కూడా మంచి టాక్ తో ప్రేక్షకాదరణ పొంది మంచి కలెక్షన్స్ రాబట్టుకున్నాయి. ఇప్పుడు వీటి థియేట్రికల్ రన్ పూర్తవ్వగా వాటి క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

సంక్రాంతికి పోటా పోటీ - ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు
ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాతో మొదలుకానున్న సంక్రాంతి సినీ పండుగ...ఎఫ్2 సినిమా వరకూ కొనసాగనున్న సంగతి తెలిసిందే. జనవరి 9వ తేదీన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రిలీజవుతుండగా.. జనవరి 10వ తేదీన పేటా.. జనవరి 11వ తేదీన వినయ విధేయ రామ, జనవరి 12వ తేదీన ఎఫ్ 2 సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. పెద్ద సినిమాలు.. అన్నీ స్టార్ హీరోల సినిమాలే కావడంతో సినిమా లవర్స్ కు పండగే పండగ. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. అసలు సమస్య ఒకటుంది. అదే థియేటర్ల కొరత.

లక్ష్మీస్ ఎన్టీఆర్ - ఎందుకు? సాంగ్ రిలీజ్
ఇటీవల లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నుండి వెన్నుపోటు పాటతో పలువురి వెన్నులో వణుకు పుట్టించారు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు ఈ సినిమా పై పలువురు అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా ఎప్పటిలాగే వర్మ అవేమీ పట్టించుకోకుండా.. తన పనిలో తాను ఉన్నాడు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి రెండో పాటను రిలీజ్ చేశారు. ఎందుకు? అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు ఈ రోజు ఉదయం తెలిపినట్టుగానే ఈ ఐదు గంటలకు పాటను రిలీజ్ చేశారు.

ప్రాణ రిలీజ్ డేట్ ఫిక్స్
వీకే ప్రకాష్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ ఓ వైవిధ్యమైన స్టోరీ ప్రాణ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఒక్క పాత్ర చుట్టూనే ఈ కథ నడుస్తుంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక్క పాత్ర చుట్టూ తిరిగే ఈ సినిమా చూడాలని ఇప్పటినుండే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. మలయాళంలో ఈ సినిమా ను జనవరి 18వ తేదీన విడుదల చేస్తుండగా...తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను... ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు.