“సమీక్ష”అనే శీర్షిక కింద ఒక సినిమా తాలూకు బాగోగులను, మంచి చెడ్డలను విశ్లేషించి, విమర్శించటం, అభినందించడం ఒక చక్కని ప్రక్రియ. ఈ సమీక్షలు కొన్ని సందర్భాల్లో కొందరికి నచ్చవచ్చు.. కొందరికి నచ్చకపోవచ్చు. సినిమా మీద తమ అభిప్రాయాన్ని సమీక్ష రూపంలో చెప్పే హక్కు సమీక్షకులకు ఎలా ఉంటుందో… ఆ సమీక్షలను సమీక్షించే హక్కు కూడా అందరికీ ఉంటుంది. అయితే బాగుందని రాసినప్పుడు ‘థాంక్యూ’ అని ఒక్క మాట కూడా చెప్పని వాళ్లు బాగోలేదని రాసినప్పుడు పచ్చి బూతుల వీరంగాలు సృష్టిస్తారు. ఇది సమీక్షకులకు- సినీ సంబంధీకులకు- అభిమానులకు మధ్య అనునిత్యం జరిగే అంతర్యుద్ధం. రివ్యూలు, సమీక్షకుల హక్కులు, పాఠకుల, సినిమా సంబంధీకుల ప్రతిస్పందన – ఇవన్నీ ఎడతెగని నిత్య చర్చనీయాంశాలు. అయితే ఒక్కటి మాత్రం నిజం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Reviewing a film is not a right… it’s a responsibility- అనే కోణంలో రివ్యూ రైటర్స్ ఆలోచించాలి…అదే కోణంలో పాఠకులు , సినిమా సంబంధీకులు స్పందించాలి. కానీ దురదృష్టవశాత్తు చాలా సందర్భాలలో ఈ ఇరువర్గాల మధ్య పరస్పర అవగాహన కుదరదు. అందుకే ఆ రెండు వర్గాల మధ్య నిరంతర స్పర్ధ కొనసాగుతూనే ఉంది… అదొక నిరంతర చర్చనీయాంశంగా మిగిలిపోతూనే ఉంది.
ప్రస్తుత విషయానికి వస్తే – విమర్శ, విశ్లేషణ సమీక్షకుల వృత్తి అయినప్పటికీ కొన్ని అరుదైన సందర్భాల్లో విమర్శకుల ఆలోచనా ధోరణి సరళంగా , సార్వజనీనంగా ఉండాలి. రెగ్యులర్ మాస్ మసాలా చిత్రాలను సమీక్షించే దృష్టికోణంలో కొన్ని అరుదైన ప్రయత్నాలను కూడా విమర్శించటం సమంజసం కాదు. విమర్శ అనేది మంచిచెడ్డల సునిశిత విశ్లేషణ గా ఉండాలి కానీ అందులో రంధ్రాన్వేషనాసక్తి ఎక్కువగా కనిపించకూడదు.
నిన్న విడుదలైన “ఎన్టీఆర్- కథానాయకుడు” చిత్ర సమీక్షల విషయంలో కూడా ఇలాంటి రంద్రాన్వేషణ ఎక్కువ మోతాదులో కనిపించింది.నిజానికి ఒక సినిమాను విశ్లేషణాత్మక కోణంలో సమీక్షించడంలో ఆక్షేపించవలసింది ఏమి లేకపోయినప్పటికీ మహానటి, ఎన్టీఆర్ – కథానాయకుడు వంటి అరుదైన ప్రయత్నాలను కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమా స్కేలింగ్ పరిధిలోకి తెచ్చి విమర్శలు గుప్పించడం మేకర్స్ మనోస్థైర్యాన్ని దెబ్బతీయటమే అవుతుంది.
నిజానికి క్రమశిక్షణ, కట్టుబాటు, కఠోర శ్రమ, అసామాన్య ప్రతిభ, అనితరసాధ్యమైన కార్యసాధన వంటి మహోన్నత లక్షణాలు కలిగిన ఎన్. టీ. రామారావు జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి ఉపయుక్తమయ్యే పాఠ్యాంశ లక్షణాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటి అసాధారణ వ్యక్తి యొక్క జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరిస్తూ ఒక గొప్ప ప్రయత్నం చేసినప్పుడు దానిని ఎలాంటి దృష్టి కోణంలో చూడాలి… ఎలాంటి సానుకూల ప్రతిస్పందన ఇవ్వాలి అన్న విషయాన్ని ‘నల్లమోతు శ్రీధర్’ అనే ఒక ఔత్సాహిక విశ్లేషకులు చాలా చక్కగా వివరించారు. ఆయన మీడియా వ్యక్తి అయినప్పటికీ రెగ్యులర్ రివ్యూ రైటర్ కాదు. రెగ్యులర్ గా సినిమాలు చూస్తూ రివ్యూల పేరుతో పోస్టుమార్టం రిపోర్టులు ఇవ్వరు. కానీ “ఎన్టీఆర్- కథానాయకుడు” చిత్రాన్ని చూసి ఆయన స్పందించిన తీరు చాలా చాలా బాగుంది. ఇలాంటి అరుదైన ప్రయత్నాన్ని ఎలా అభినందించాలో చాలా చక్కగా చెప్పిన నల్లమోతు శ్రీధర్ రివ్యూ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర నిర్మాణంలోని “సృజనాత్మక శ్రమ”ను చక్కగా ఆకళింపు చేసుకుని మంచి విశ్లేషణ అందించిన ‘నల్లమోతు శ్రీధర్’ ను అభినందిస్తూ ఆయన రివ్యూను యధాతధంగా మీకు అందిస్తుంది “దతెలుగుఫిలింనగర్.కామ్ “.
[youtube_video videoid=cUJU4aMQR0c]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: