నందమూరి బాలకృష్ణ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు గా రూపొందిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ జనవరి 9వ తేదీ రిలీజయి హిట్ టాక్ తో విజయపథం లో దూసుకుపోతుంది. ఈ మూవీ చూసిన చిత్ర ప్రముఖులు తమ స్పందన తెలియజేశారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ పై తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు క్రిష్ తన అసమాన దర్శకత్వ ప్రతిభతో ఎన్టీఆర్ బయోపిక్ మూవీ మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ ని వెండి తెర పై అద్భుత దృశ్య కావ్యం గా మలిచారు. లెజెండరీ నటుడు ఎన్టీఆర్ క్యారెక్టర్ లోబాలకృష్ణ పరకాయప్రవేశం చేసారు . ఆ విషయం మూవీ లోని ప్రతీ బిట్ లోనూ ప్రతిఫలించింది. ఎన్టీఆర్ కధానాయకుడు మూవీ లోని అన్ని క్యారెక్టర్స్, నిజ జీవిత క్యారెక్టర్స్ ప్రతిబింబించేలా క్రిష్ రూపొందించారు. నట సార్వభౌమ ఎన్టీఆర్ కు ఈ మూవీ ఘన నివాళి. ఎన్టీఆర్ బయోపిక్ రెండవ పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు మూవీ గురించి ఆసక్తితో ఎదురు చూస్తున్నానని, చిత్ర యూనిట్ కు అభినందనలు తెలుపుతూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.
[youtube_video videoid=cUJU4aMQR0c]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: