సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా `పేట`. `బాషా` తరువాత దాదాపు 24 ఏళ్ళ అనంతరం సంక్రాంతికి విడుదలవుతున్న సూపర్ స్టార్ సినిమా ఇదే కావడంతో… ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో రజనీకి జోడీగా తొలిసారిగా సీనియర్ హీరోయిన్లు సిమ్రాన్, త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ ఇద్దరు నాయికలకు సంక్రాంతి సెంటిమెంట్ బలంగానే ఉంది. సిమ్రాన్ కెరీర్ ని మలుపు తిప్పిన తెలుగు చిత్రాలు `సమరసింహా రెడ్డి` (1999), `కలిసుందాం…రా!`(2000), `నరసింహనాయుడు`(2001)… మూడు వరుస సంవత్సరాల్లో సంక్రాంతి కానుకగానే విడుదలై ఆమెను స్టార్ హీరోయిన్ చేశాయి. అలాగే… త్రిష విషయానికి వస్తే… ఆమెను ఓవర్ నైట్ స్టార్‌గా మార్చేసిన `వర్షం` (2004)తో పాటు `ఉత్తమ నటి`గా `నంది`ని అందించిన `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`(2005)కూడా సంక్రాంతి సీజన్‌లో విడుదలైంది. అలాగే `కృష్ణ` (2008)తో మరో సంక్రాంతి విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది. మరి… సంక్రాంతి సీజన్‌లో `హ్యాట్రిక్ హిట్స్ స్పెషలిస్ట్స్` అయిన సిమ్రాన్, త్రిష… చాలా గ్యాప్ తరువాత అదే సీజన్‌లో ఈ రోజు (జనవరి 10) విడుదలవుతున్న `పేట`తో ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=sPxTnkBrmhw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: