ప్రాణ రిలీజ్ డేట్ ఫిక్స్

వీకే ప్రకాష్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ ఓ వైవిధ్యమైన స్టోరీ ప్రాణ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఒక్క పాత్ర చుట్టూనే ఈ కథ నడుస్తుంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక్క పాత్ర చుట్టూ తిరిగే ఈ సినిమా చూడాలని ఇప్పటినుండే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. మలయాళంలో ఈ సినిమా ను జనవరి 18వ తేదీన విడుదల చేస్తుండగా...తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను… ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ఇండియా టాప్ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్ కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్నారు. లూయిజ్ బ్యాంక్స్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ రకుల్ పూకుట్టి ఈ సినిమా కోసం తొలిసారిగా ‘సింకర్‌నైజ్డ్‌ సరౌండ్‌ సౌండ్‌ సిస్టమ్‌’ అనే కొత్త టెక్నాలజీని వాడుతున్నారు.

ఏదేమైనా రెండున్నర గంటల పాటు ఒకే పాత్ర తన నటనతో రక్తి కట్టించడం సాదాసీదా విషయమేం కాదు. మరి ఈ కొత్త తరహా ప్రయోగం ఎలా ఉండబోతోందో.. ఒక్క క్యారెక్టర్ తో ఈ సినిమాను ఎలా నడిపించారో తెలియాలంటే సినిమా వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=I5aN3mbY8eU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.