ఇలా అయితే సినిమా ఇండస్ట్రీ బతికి బట్ట కట్టేదెలా

NTR Kathanayakudu Movie Piracy by Tamilrockers,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tamilrockers Leaks Kathanayakudu Movie Piracy,NTR Kathanayakudu Movie Piracy News,NTR Kathanayakudu Movie Latest News,NTR Kathanayakudu Movie Piracy Leaked by Tamilrockers
NTR Kathanayakudu Movie Piracy by Tamilrockers

నిన్నంటే నిన్న రిలీజ్ అయింది “ఎన్టీఆర్- కథానాయకుడు”. సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చింది. బయోపిక్ కావటంతో ఓపెనింగ్స్ గొప్పగా లేకపోయినప్పటికీ “అద్భుతం” అనే మౌత్ టాక్ స్ప్రెడ్ అవటంతో సాయంత్రానికల్లా సినిమా మీద గొప్ప పాజిటివ్ రిపోర్ట్ వైరల్ అయింది. అన్ని ప్రాంతాల నుండి మంచి రిపోర్ట్స్ రావటంతో దర్శక నిర్మాతలు, యూనిట్ మెంబర్స్, నందమూరి అభిమానులు, పరిశ్రమ ప్రముఖులు అందరూ ఆనందంగా ఉన్నారు. కానీ సాయంత్రానికల్లా “ఎన్టీఆర్- కథానాయకుడు” నెట్ లో వచ్చేసింది. అంటే థియేటర్లో సినిమా చూసి ఇంటికి వచ్చి రివ్యూస్, పబ్లిక్ టాక్ చూద్దామనుకునే సరికే సినిమా నెట్ లో కనిపించటం చూసి షాక్ అవ్వడం ప్రేక్షకుడి వంతయింది.

ఏమిటీ దారుణం? ఏమిటి దోపిడి? ఇంత వేగంగా కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఒక సినిమాను ఇలా నిలువుదోపిడీ చేసి పబ్లిక్ లో అయిదు రూపాయల అంగడి సరుకును చేసేస్తే ఏమనుకోవాలి?
ఎవడో ” తమిళ రాకర్స్” అట… ఈ దొంగ రాస్కెల్స్ ఎంత పెద్ద సినిమా రిలీజైనా సాయంత్రానికల్లా దాన్ని నెట్లో లోడ్ చేసి వదిలేస్తున్నారు. ఈ తక్షణ సినీచౌర్యం వల్ల ఈ వెధవలు ఎంత సంపాదిస్తారో తెలియదు కానీ వీళ్ళ చిల్లర కక్కుర్తి కోసం కోట్ల రూపాయల సినిమాలను నిర్దాక్షిణ్యంగా నిలువు దోపిడీ చేసేస్తున్నారు. గతంలో ఈ కేటుగాళ్లకు సంబంధించిన 12 వేల సైట్స్ ను మద్రాసు హైకోర్టు బ్లాక్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. ఇది కాకుండా తమిళ చిత్రరంగం ఎన్నో మార్లు వీళ్లను హెచ్చరించింది. అయితే అసంపూర్ణమైన, అపరిపక్వమైన సైబర్ చట్టాల కారణంగా మమ్మల్ని ఎవడు ఏమి పీకలేడు అనే ధైర్యంతో ఈ హైటెక్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మరి వీళ్ల సైబర్ దురాగతాలకు అంతం ఎప్పుడో…ఎలాగో అర్థం కావటం లేదు. ఒకప్పుడు వీడియో పైరసీ మీద పోలీసుల సహకారంతో అధికారులు- అభిమానులు కలిసి దాడి చేసిన విధంగా దాడులకు పాల్పడితే తప్ప ఈ హైటెక్ దురాగతాలు ఆగవు.

ఏది ఏమైనా మంచి పాజిటివ్ టాక్ తో సంచలన విజయాన్ని సాధిస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ఇంత త్వరగా, ఇంత వేగంగా ‘నెట్’ పాలుకావటం దురదృష్టకరం , బాధాకరం. ఇది నందమూరి అభిమానులు ఘాటుగా స్పందించవలసిన తక్షణ సమస్య.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=_HI382L1aKM]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here