2018 సంవత్సర ప్రారంభంలో “జై సింహా ” హిట్ ద్వారా టాలీవుడ్ కు తొలి విజయాన్ని అందించిన నందమూరి నటసింహం బాలకృష్ణ 2019 లో కూడా తొలి విజయాన్ని నమోదు చేసుకుని టాలీవుడ్ కు మరో శుభారంభాన్నిచ్చారు. ఈ రోజు విడుదలైన “ఎన్టీఆర్ కథానాయకుడు” సూపర్ హిట్ అనే టాక్ ను సొంతం చేసుకోవడంతో బాలయ్య వరుసగా రెండవసారి సంక్రాంతి స్టార్ గానే కాకుండా “ది బెస్ట్ బిగినర్ ఆఫ్ ద ఇయర్” గా నిలిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని రెగ్యులర్ కమర్షియల్ ఫిలిమ్స్ ను స్కేల్ చేసే పారామీటర్స్ లో స్కేల్ చేయకూడదు. ఈ చిత్రాన్ని ఒక మహోన్నత నటుడైన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావుకు చెల్లించిన ఘననివాళిగా భావించాలి. అలాగని ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేవు అనుకుంటే పొరపాటే. వాస్తవానికి బయోపిక్ అనగానే అదొక డాక్యుమెంటరీ అటెంప్ట్ అనుకునే అవకాశం ఉంది.
స్వభావరీత్యా జీవిత చరిత్రల్లో ఉండేది డాక్యుమెంటేషనే. కానీ “ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమాలో డాక్యుమెంటేషన్ ను చాకచక్యంగా అవాయిడ్ చేస్తూ అంతర్లీనంగా చాలా ఆహ్లాదకరమైన మెలో డ్రామాను ఇంప్లాంట్ చేశాడు దర్శకుడు క్రిష్. అయితే ఎన్టీఆర్ అనే సబ్జెక్టు లొనే గొప్ప ఒరిజినల్ మెటీరియల్ ఉండటంతో క్రిష్ చేయించడంలో ఎంత సక్సెస్ అయ్యారో చెయ్యడంలో బాలకృష్ణ అంతకు పదింతలుగా విజృంభించారు. మొత్తానికి వరుసగా రెండవసారి మంచి ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా, సంక్రాంతి స్టార్ గా నిలిచి గెలిచిన నందమూరి నటసింహం బాలకృష్ణకు విజయాభినందనలు- శుభాభినందనలు పలుకుతుంది
“దతెలుగుఫిలింనగర్.కామ్”.
[youtube_video videoid=-PecKwiSzbw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: