తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి. అలాంటి ఈ సీజన్‌లో విడుదలయ్యే సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఈ ఏడాది కూడా మూడు స్ట్రయిట్ ఫిల్మ్స్ సెల్యులాయిడ్ పై సందడి చేయనున్నాయి. ఆ చిత్రాలే `యన్.టి.ఆర్. కథానాయకుడు`, `వినయ విధేయ రామ`, `ఎఫ్ 2`. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ చిత్రాల్లో నటించిన కొంతమంది నటీనటులతో పాటు దర్శకులకు కూడా సంక్రాంతి సమయంలో సందడి చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఈ రోజు (జనవరి 9) ప్రేక్షకుల ముందుకొచ్చిన `యన్.టి.ఆర్. కథానాయకుడు`లో కీలక, అతిథి పాత్రల్లో నటించిన విద్యా బాలన్, రానా, కళ్యాణ్ రామ్, నిత్యా మీనన్, షాలిని పాండే, పాయల్ రాజ్‌పుత్‌కి ఇదే తొలి సంక్రాంతి రిలీజ్ కావడం విశేషం. అలాగే ఈ నెల 11న విడుదల కానున్న `వినయ విధేయ రామ`కి దర్శకుడైన బోయపాటి శ్రీనుకి… అందులో హీరోయిన్‌గా నటించిన కియరా అద్వాని, కీలక పాత్రలో నటించిన స్నేహకి ఇదే మొదటి సంక్రాంతి సీజన్ సినిమా. ఇక ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న`ఎఫ్ 2` విషయానికి వస్తే… చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు… యువ కథానాయకుడు వరుణ్ తేజ్, హీరోయిన్లు తమన్నా, మెహరీన్‌కు కూడా ఇదే ఫస్ట్ సంక్రాంతి రిలీజ్ కావడం విశేషం.
తొలిసారిగా సంక్రాంతికి పలకరించబోతున్న వీరందరికీ… మంచి ఫలితాలు దక్కాలని ఆకాంక్షిద్దాం.
[youtube_video videoid=and6XZwInKM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: