నటసింహ నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం పోషించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించాయి. ఆ చిత్రాలలో `పెద్దన్నయ్య` (1997) ఒకటి. `వంశానికొక్కడు` (1996) వంటి విజయవంతమైన చిత్రం తరువాత శరత్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా ఇది. సంక్రాంతి సీజన్‌లోనే రిలీజైన ఈ రెండు కుటుంబ కథా చిత్రాలూ మంచి విజయం సాధించాయి. కుటుంబ విలువలకు పెద్దపీట వేసిన ఈ చిత్రాన్ని రామకృష్ణ హార్టి కల్చరల్ సినీ స్టూడియోస్ పతాకంపై బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. బాలయ్యకి జోడీగా రోజా, ఇంద్రజ నటించిన ఈ సినిమాలో అచ్యుత్, రాజ్ కుమార్, శుభశ్రీ, అన్నపూర్ణ, కోట శ్రీనివాసరావు, చరణ్‌రాజ్, శ్రీహరి, బ్రహ్మానందం, సుధాకర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కోటి సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా ‘కుటుంబం… అన్నగారి కుటుంబం’ పాట కుటుంబ సభ్యుల మధ్య అనురాగ, ఆప్యాయతలను చక్కగా ఆవిష్కరించింది. అలాగే ‘చిక్కింది చామంతి పూవు’, ‘నీ అందమంత’, ‘చక్కిలాల చుక్క చక్కగుందిరో’, ‘కలలో కళ్యాణ మాల’ పాటలు కూడా అలరించాయి. సంక్రాంతి కానుకగా జనవరి 10, 1997న ప్రేక్షకుల ముందుకొచ్చిన `పెద్దన్నయ్య`… నేటితో 22 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=vKPIBJh4EHw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: