ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమ బయోపిక్ మూవీస్ రూపొందించడం లో నిమగ్నమై ఉంది. బయోపిక్ మూవీస్ సక్సెస్ రేట్ అధికంగా ఉండటం తో అన్ని భాషల నిర్మాతలు బయోపిక్ మూవీస్ నిర్మాణానికి మొగ్గు చూపుతున్నారు. సక్సెస్ ఫుల్ సినీ హీరోయిన్, దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ మూవీ కి కోలీవుడ్ లో డిమాండ్ ఉంది. దర్శకురాలు ప్రియదర్శిని రూపొందించే
ది ఐరన్ లేడీ తో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ అనౌన్స్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పేపర్ టేల్స్ బ్యానర్ పై ప్రియదర్శిని దర్శకత్వంలో రూపొందే జయలలిత బయోపిక్ మూవీ లో జయలలిత గా టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యా మీనన్ నటిస్తున్నారు. ది ఐరన్ లేడీ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో జనవరి 24తేదీ నుండి జరుగనుంది.ఈ మూవీ మేజర్ షూటింగ్ పార్ట్ హైదరాబాద్ లో జరుగనుందని సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ది ఐరన్ లేడీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
[youtube_video videoid=xsTZWd1V_8M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: