మహానటుడు యన్టీఆర్ కథానాయకుడిగానే కాదు దర్శకుడిగానూ తెలుగునాట తనదైన ముద్ర వేశారు. `సీతారామకళ్యాణం`, `గులేబకావళి కథ`, `శ్రీకృష్ణ పాండవీయం` చిత్రాలతో దర్శకుడిగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న యన్టీఆర్… స్వీయదర్శకత్వంలో రూపొందించిన నాలుగో చిత్రం `వరకట్నం`. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు… కథ, స్క్రీన్‌ప్లేను కూడా అందించారాయన. వరకట్నం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో యన్టీఆర్ సరసన కృష్ణకుమారి కథానాయికగా నటించగా… సావిత్రి, సత్యనారాయణ, నాగభూషణం, మిక్కిలినేని, రేలంగి, పద్మనాభం, సూర్యకాంతం, చంద్రకళ, హేమలత తదితరులు ఇతర ముఖ్యపాత్రలను పోషించారు. నేషనల్ ఆర్ట్ థియేటర్స్, రామకృష్ణ సినీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి యన్.త్రివిక్రమరావు నిర్మాతగా వ్యవహరించారు. యన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన సంగీత దర్శకుడు టి.వి.రాజు స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. జనవరి 9, 1969న విడుదలైన ఈ సినిమా… నేటితో 50 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=-LQ5lxN7_lU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: