సీనియర్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్‌కు ఉన్న ట్రాక్ రికార్డే వేరు. తన తరం కథానాయకులలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న స్టార్ తనే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాదు… వెంకీ హీరోగా నటించిన చిత్రాలు దాదాపుగా మ్యూజికల్ హిట్సే. అలాంటి మ్యూజికల్ హిట్స్‌లో `చంటి`ని ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. తమిళ చిత్రం `చిన తంబి` ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా… ఇళయరాజా స్వరసారథ్యంలో రూపొంది మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలచింది. ఇందులోని ప్రతీ పాట ఆబాలగోపాలాన్ని అలరించింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ అధినేత కె.ఎస్.రామారావు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. వెంకటేష్ కి జంటగా మీనా నటించిన ఈ సినిమాలో సుజాత, నాజర్, మంజుల, బ్రహ్మానందం తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. జనరంజకంగా రూపొందిన `చంటి` జనవరి 10, 1992న విడుదలై… రికార్డు స్థాయి కలెక్షన్లను నమోదు చేసుకుని అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలచింది. నేటితో 27 వసంతాలను పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా… ఇప్పటికీ బుల్లితెరపై కుటుంబ ప్రేక్షకులను కనువిందు చేస్తూనే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చంటి – కొన్ని విశేషాలు:
* వెంకటేష్ , మీనా కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రమిది. ఆ తరువాత వీరి కలయికలో వచ్చిన `సుందరకాండ`, `అబ్బాయి గారు`, `సూర్య వంశం`, `దృశ్యం` కూడా ఘనవిజయం సాధించాయి. `పర్‌ఫెక్ట్ హిట్ పెయిర్`గా వారికి మంచి గుర్తింపును తీసుకువచ్చాయి.
* వెంకటేష్ బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే. అయితే… తన తొలి అడుగు మాత్రం `అనారి`తోనే మొదలైంది. `చంటి`కి హిందీ వెర్షన్ అయిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారాయన.
* దాదాపు 40 కేంద్రాలలో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుని… అప్పట్లో కొత్త రికార్డును నెలకొల్పింది.
[youtube_video videoid=QC0iU36Qhx0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: