ఇటీవల లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నుండి వెన్నుపోటు పాటతో పలువురి వెన్నులో వణుకు పుట్టించారు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు ఈ సినిమా పై పలువురు అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా ఎప్పటిలాగే వర్మ అవేమీ పట్టించుకోకుండా.. తన పనిలో తాను ఉన్నాడు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి రెండో పాటను రిలీజ్ చేశారు. ఎందుకు? అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు ఈ రోజు ఉదయం తెలిపినట్టుగానే ఈ ఐదు గంటలకు పాటను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘జయసుధ.. జయప్రద.. శ్రీదేవీ..!.. వీళ్లందరినీ వదిలి ఆ లక్ష్మీపార్వతినే ఎందుకు?.. ఎందుకు?.. ఎందుకు?’ అంటూ సాగే ఈ పాటను సిరాశ్రీ రాయగా… శ్రీకృష్ణ, కళ్యాణి మాలిక్ పాడారు. ‘‘ఈ పాటలోని ప్రశ్నల వెనుక.. అబద్ధాలుగా చెలామణి అవుతున్న నిజాలను.. నిజాలుగా మసిపూసుకున్న అబద్ధాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయటమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‘ ధ్యేయం’’.. 20 సంవత్సరాలకి పైగా నిజానికి అబద్దం అనే బట్టలు తొడిగి.. వీధులెంట తిప్పుతున్న వెన్నుపాటుదారులందరి బట్టల్ని ప్రజల కళ్లముందు చింపి అవతల పారేసి.. నిజం బట్టలని ఒక్కొక్కటిగా.. మెల్లగా విప్పి దాన్ని మళ్లీ పూర్తి నగ్నంగా చూపించడమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉద్దేశ్యం అంటూ వర్మ పాట చివరిలో చెప్పిన డైలాగ్స్ ను చూస్తుంటే ఈ సినిమాపై బాగానే రచ్చ జరిగే సూచనలు ఇప్పటినుండే కనిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశం నుంచి ఎన్నో విషయాలను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో వర్మ చూపించబోతున్నారు. వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి తమ్ముడు కల్యాణీ మాలిక్ సంగీతం అందిస్తున్నాడు. జీవీ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
[youtube_video videoid=oL3qA7A3Nbo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: