కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollwood Movie Updates

ట్యాగ్ · 48 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

'లూసిఫర్' రీమేక్ - 'చిరు'ని ఢీకొట్టే పాత్రలో 'రెహ్మాన్'..!

మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. 'సాహో' ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో పాత్రలో రోజుకో వార్త వింటూనే వున్నాం. ఇక ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సోనూసూద్ తొలి తెలుగు సినిమా 'హ్యాండ్సప్' అని తెలుసా..!

కొంతమంది నటీనటులు ఎన్నో ఏళ్ళ నుండి సినీ పరిశ్రమలో పని చేస్తుంటారు కానీ కొంతమందికి ఏదో ఒక పాయింట్ దగ్గర బ్రేక్ వస్తుంది. నటుడు సోనూసూద్ విషయంలో కూడా ఇదే జరిగినట్టు కనిపిస్తుంది. నిజానికి ఇప్పుడు సోనుసూద్ అంటే మనకు మొదట గుర్తొచ్చే క్యారక్టర్ పశుపతి. వదల బొమ్మాళి అంటూ సోనుసూద్ చేసిన నటన తన కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఇలాంటి పాత్రలు ఒక్కసారే వస్తాయి. అరుంధతి సినిమా ముందు మనకి సోను సూద్ అంటే పూరీ జగన్నాధ్ సినిమా సూపర్ గుర్తొస్తుంది. ఈ సినిమా కూడా సోను సూద్ కు మంచి గుర్తింపునిచ్చింది. కానీ అరుంధతి మాత్రం కెరీర్ ను మార్చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

గ్రీన్ ఛాలెంజ్ - పార్క్ ను దత్తత తీసుకున్న శర్వానంద్..!

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో యంగ్ హీరో శర్వానంద్ కూడా చేరాడు. గొప్ప విషయం ఏంటంటే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వచ్ఛందంగా స్వీకరించాడు శర్వా. బంజారాహిల్స్ లోని తన ఇంటి పక్కన ఉన్న పార్క్‌లో ఎంపీ సంతోష్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి మొక్కలు నాటారు.అంతేకాదు త‌మ‌ ఇంటి పక్కన ఉన్న జీహెచ్ఎంసీ పార్కును దత్తత తీసుకొని అందులో మొక్కలు నాటుతానని కూడా చెప్పాడు. అనంతరం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను నిర్మాత‌లు ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ అధినేత అనిల్ సుంకర, 14 రీల్స్ ప్లస్‌ రామ్ ఆచంట- గోపి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

గౌతమ్, సితారలకు ఇష్టమైన ఫుడ్ ఇదే..!

ఈ మధ్య సోషల్ మీడియాలో పలు ఛాలెంజ్ లు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ ఒక ఛాలెంజ్ ను స్వీకరించారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా వాట్స్ ఇన్ యువర్ కిడ్స్ డబ్బా అనే ఛాలెంజ్ లో భాగంగా ఈ ఛాలెంజ్ స్వీకరించాలని నమ్రతను నామినేట్ చేసింది. దీనితో ట్వింకిల్ ఖన్నా ఛాలెంజ్ ను స్వీకరించిన నమ్రత తన పిల్లలు ఎలాంటి ఫుడ్ ఇష్టపడతారో.. తెలుపుతూ రెసిపీని కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన పిల్లలకి బెండకాయ ఫ్రై, చోళే మసాలా ఇంకా ఎల్లో రైస్ ఇష్టమని ఆ ఫొటోను కూడా పోస్ట్ చేసింది. అంతేకాదు.. నన్ను నామినేట్ చేసినందుకు ట్వింకిల్ ఖన్నా కు…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

చిత్ర పరిశ్రమలో మరో కొత్త శాఖ

కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ సంక్షోభం లో చిక్కుకున్న విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమ పై ఆధారపడ్డ కార్మికులు పలు అవస్థలకు గురిఅవుతున్నారు. షూటింగ్స్ కు అనుమతి వచ్చినా పెద్ద సినిమాలు సెట్స్ పైకి వెళ్ళడం లేదు. కరోనా కష్ట పరిస్థితులలో కళ తప్పిన చిత్ర పరిశ్రమ గాడిన పడేందుకు కొత్త ఆలోచనలు చేస్తుంది. 24 విభాగాలుగా ఉన్న చిత్ర పరిశ్రమ మరో కొత్త విభాగానికి తెరతీసింది. అదే కోవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ . సురక్షిత వాతావరణంలో షూటింగ్ కొనసాగించేందుకు చిత్ర పరిశ్రమ కోవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకుంటుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సూర్య బర్త్ డే ట్రీట్.. 'ఆకాశమే నీ హద్దురా' నుండి స్పెషల్ అప్ డేట్..!

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల రిలీజ్ మాత్రం ఆపాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు వార్తలు రాగా వాటిపై స్పందించి ఓటీటీలో రిలీజ్ చేసే ప్లాన్ లేదని తెలిపారు. ఇక ఎప్పటినుండో ఈ సినిమా అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి సూర్య పుట్టిన రోజు నాడు ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వనున్నట్టు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రపంచం అందించే ఉత్తమమైనవి ఇవే..!

ఫిట్ నెస్ కు వయసుతో సంబంధం లేదు. ఎంత ఫిట్ గా ఉంటే అంత యాక్టీవ్ గా.. అంత ఆరోగ్యంగా ఉంటాం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును అది చూస్తే అర్ధం చేసుకోవచ్చు. ఎన్నో ఏళ్ళ నుండి మనం ఆయన్నిచూస్తూనే ఉన్నాం. ఎప్పుడు చూసిన ఒకేలా కనిపిస్తారు. ఆయన వయసు పెరగడం ఆగిపోయిందమేమో అన్నట్టు ఉంటారు ఆయన. ఇక దీనికి కారణం ఆయన ఫిట్ నెస్ మైంటైన్ చేయడం చెప్పొచు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

"భజరంగి 2" మూవీ టీజర్ రిలీజ్

ఫిల్మ్ ఎంటర్ టైనర్స్ పాత్ బ్యానర్ పై ఏ. హర్ష దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన ఫాంటసీ యాక్షన్ "భజరంగి " మూవీ 2013 సంవత్సరం డిసెంబర్ 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ "భజరంగి 2" మూవీ రూపొందింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బన్నీ ఒక్క ఛాన్స్ అంటున్న బాలీవుడ్ డైరెక్టర్..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పని చేసే అవకాశం కోసం ఎక్కవ సమయం ఆగలేనంటున్నాడు ఓ డైరెక్టర్. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..? టాలీవుడ్ డైరెక్టర్ అయితే ఇంత స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాట అంటుంది బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా. దీనికి కారణం అల్లు అర్జున్ రీసెంట్ మూవీ 'అల వైకుంఠపురములో' సినిమానే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తనయుడికి బర్త్ డే శుభాకాంక్షలు

4దశాబ్దాలు గా దక్షిణాది భాషల మూవీస్ తో పాటు హిందీ మూవీస్ లో కూడా సుమారు 340 చిత్రాలలో నటించిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ 5నేషనల్ అవార్డ్స్ తో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మలయాళ చిత్ర పరిశ్రమ లో హీరో గా రాణిస్తున్నారు. ఈ రోజు తన తన తనయుడు ప్రణవ్ బర్త్ డే సందర్భంగా మోహన్ లాల్ ట్విట్టర్ ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న అయాన్, అర్హల..!

సెలబ్రిటీస్ పిల్లలు ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. సెలెబ్రటీస్ కూడా తమ పిల్లల ఫొటోస్, వారితో ఆడే వీడియోస్ లాంటి స్వీట్ మెమోరీస్ ను ఎప్పటికప్పుడు తమ ట్విట్టర్ లో కానీ... ఇన్స్టా లో కానీ పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు. అయాన్, అర్హ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే వుంటారు బన్నీ,స్నేహ రెడ్డి. ఇక ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హలకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయాన్, అర్హలు కలర్ ఫుల్ రెయిన్ కోట్ ధరించి గార్డెన్ లో ఆడుకుంటూ వర్షంలో నిలుచొని ఉన్నారు. ఇక ఈ ఫొటోను ను తీసి స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఐఏఎస్ ఆఫీసర్‌ పాత్రలో సాయి ధరమ్ తేజ్

"చిత్ర లహరి ", ప్రతి రోజూ పండగే " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో టాలీవుడ్ లో కొనసాగుతున్న హీరో సాయితేజ్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న "సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ "ప్రస్థానం " మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో ఒక మూవీ కి సాయి తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'ఆచార్య' ఆల్బమ్ పై మణిశర్మ క్రేజీ అప్ డేట్..!

టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ, మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి టైటిల్ తప్పా ఇంత వరకూ ఎలాంటి అప్ డేట్ వచ్చింది లేదు. అప్ డేట్స్ ఇచ్చే లోపే కరోనా వచ్చి పడటంతో షూటింగ్ కు కూడా బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. మొదటి నుండి ఈ సినిమాలు కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ నాలుగు నెలలు కనుక ఇలాంటి పరిస్థితులు లేకుండా ఉండి ఉంటేదాదాపు షూటింగ్ ముగిసేదే. ఎలాగూ షూటింగ్ లు కూడా లేవు అప్ డేట్స్ కూడా లేకుండా పోయాయి.

TFN Adminవాట్సాప్
Tollywood Actor Akkineni Nagarjuna Throws Green Challenge To Her Daughter In Law Samantha Akkineni
సినిమా వార్తలు

కోడలితో మొక్కలు నాటించిన నాగ్..!

టీఆర్ఎస్‌ నేత, ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమంలో ఎంతో మంది పాల్గొని మొక్కలు నాటారు. దీనిలో భాగంగానే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన నాగార్జున తన కోడలు సమంతకు ఛాలెంజ్ విసిరారు. ఈ నేపథ్యంలో సమంత కూడా తన మామ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి.. జూబీలీహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు. నాగార్జున దగ్గరుండి మరీ మొక్కలు నటించారు. ఇక ఛాలెంజ్ ను పూర్తి చేసిన సమంత తర్వాత ఛాలెంజ్ ను కీర్తి సురేశ్, రష్మిక మందన్ లకు విసిరింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'కె.జి.యఫ్ 2' కోసం అడగలేదు...!

పెద్ద సినిమా అంటే రూమర్స్ ఆపడం కష్టమే. ఏదో ఒక రూమర్ వెంట వెంటనే వస్తూనే ఉంటాయి. దర్శకనిర్మాతలు ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా వాటిని ఆపడం కష్టమే. ఇక కె.జి.యఫ్ 2 సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది. ఏదో ఒక రూమర్ వస్తూనే వుంది ఈ సినిమాపైనా. మొన్నటివరకు రిలీజ్ విషయంలో పలు వార్తలు రాగా ఇప్ప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో అధీర పాత్ర ఉందన్న సంగతి తెలిసిందే కదా. ఈ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ చేస్తున్న విషయం కూడా విదితమే. ఈ నేపథ్యంలో ‘అధీరా’ పాత్ర కోసం ముందుగా కన్నడ స్టార్ హీరో సుదీప్‌ను సంప్రదించారనే వార్త గత రెండు రోజులుగా చక్కర్లు కొడుతుంది. ఇక ఈ వార్తలపై సుదీప్…

TFN Adminవాట్సాప్
Actress Anushka Shetty To Pair Up Once Again With Gopichand In Teja Alimelu Manga Venkataramana
సినిమా వార్తలు

'అలివేలుమంగ' గా గోపీచంద్ తో మరోసారి..?

సీత సినిమా తర్వాత తేజ రెండు సినిమాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘అలివేలుమంగ వెంకటరమణ’ కాగా మరోటి ‘రాక్షసరాజు రావణాసురుడు’. ఎప్పుడో ఈ రెండు సినిమాలను అధికారికంగా ప్రకటించాడు. ఈ రెండు చిత్రాలలో ఒక చిత్రంలో ‘రాక్షసరాజు రావణాసురుడు’రానా నటిస్తుండగా ‘అలివేలుమంగ వెంకటరమణ’ చిత్రంలో గోపి చంద్ నటించనున్నాడు.

TFN Adminవాట్సాప్
సాంగ్

'సర్కారు వారి పాట' ఖాతాలో మొదటి రికార్డ్

అలా వచ్చాడో లేదో ఇలా అప్పుడే రికార్డులు క్రియేట్ చేసే పనిలో పడ్డాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. నిన్న కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ సినిమా టైటిల్ ను, ప్రీ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక రాక రాక తమ హీరో సినిమా అప్ డేట్ వచ్చింది..మరి మహేష్ బాబు ఫ్యాన్స్ ఊరుకుంటారా. ‘సర్కారు వారి పాట’లో లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్ తో స్టైలిష్ ప్లస్ మాస్ లుక్ లో వుండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ లుక్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకోవడంతో సోషల్ లైక్ లు, షేర్ లతో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అంతేకాదు మరో రికార్డు ను కూడా సొంతం చేసుకుంది. 24 గంటల్లో మోస్ట్ రీట్వీట్ చేసిన ప్రీ లుక్ ఇదే, అలాగే మోస్ట్ లైక్స్…

TFN Adminవాట్సాప్
Mega Star Chiranjeevi Accolades RX 100 Actor Kartikeya Gummakonda
సినిమా వార్తలు

కార్తికేయ కు చిరంజీవి అభినందనలు

సూపర్ హిట్ "RX 100 " మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న కార్తికేయ మూవీస్ జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకున్న హీరోల్లో ఒకరు. లాక్ డౌన్ సమయంలో ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టి కార్తికేయ సిక్స్ ప్యాక్ అబ్స్ ను సాధించారు. హీరో నాని "గ్యాంగ్ లీడర్ " మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన కార్తికేయ , ప్రముఖ హీరోతో రూపొందుతున్న తమిళ మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Tollywood Ace Director SS Rajamouli To Resume Shooting Work Of His Magnam Opus RRR Soon
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ ప్రారంభించే పనుల్లో జక్కన్న..!

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇంకా కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది అనుకునే లోపు కరోనా వల్ల మరో పెద్ద బ్రేక్ వచ్చింది. అయితే రాజమౌళి మాత్రం ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ గ్యాప్ లో కుదిరినంత వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Actress Rakul Preet Singh Hits 14 Million Follower Mark On Instagram
సినిమా వార్తలు

14 మిలియన్ ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న రకుల్ వర్క్ అవుట్స్, ఫోటో షూట్స్ , ఫుడ్ , మూవీ విశేషాలు వంటి విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. కరోనా కారణం గా లాక్ డౌన్ బాధితులకు తన వంతు సాయం అందించిన రకుల్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఆ ఛానల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పి ఎమ్ కేర్స్ ఫండ్ కు డైవర్ట్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్