బన్నీ ఒక్క ఛాన్స్ అంటున్న బాలీవుడ్ డైరెక్టర్..!

Noted Bollywood Director Sanjay Gupta Requests Stylish Star Allu Arjun For A Movie Opportunity After Watching His Latest Blockbuster Alavaikunthapurramulo

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పని చేసే అవకాశం కోసం ఎక్కవ సమయం ఆగలేనంటున్నాడు ఓ డైరెక్టర్. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..? టాలీవుడ్ డైరెక్టర్ అయితే ఇంత స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాట అంటుంది బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా. దీనికి కారణం అల్లు అర్జున్ రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సినిమానే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ‘అల వైకుంఠపురములో’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బన్నీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకొని కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 160 కోట్ల షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తిరగరాసింది. త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, బన్నీ కామెడీ టైమింగ్, పూజ గ్లామర్, థమన్ సాంగ్స్ అన్నీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి.

ఇక ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా ఆన్లైన్ లో చూసాడంట. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. ‘‘అల వైకుంఠపురములో సినిమా ఇప్పుడే చూశాను. మంచి వినోదాత్మకమైన సినిమా ఇది.. ఈ సినిమాను థియేటర్ లో చూడనందుకు బాధపడుతున్న.. త్వరగా ఈ సినిమాను బిగ్ స్ర్కీన్‌పై చూడాలి.. ఈ సినిమా హిందీలో రీమేక్ అవ్వకూడదు… అల్లుఅర్జున్ తో హిందీలో రీరిలీజ్ అవ్వాలి.. హిందీలో ఏ యాక్టర్ బన్నీ చేసినట్టు చేస్తాడు అని అనుకోవటం లేదు అంటూ ట్వీట్ చేసాడు..’’ఇక ఆ ట్వీట్‌ పై బన్నీ స్పందిస్తూ.. ‘‘సినిమా మీకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన మీకు ధన్యవాదాలు సంజయ్‌గారు..’’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు. దీనికి మళ్లీ సంజయ్ గుప్తా రిప్లై ఇస్తూ.. ‘‘బ్రదర్ నువ్వు ఊహించలేవు నీ పెర్ఫార్మెన్స్ కి నేను ఎంత ఫిదా అయ్యానో.. నీ కామెడీతో ఎంత నవ్వించావో.. నీ ఎమోషన్ తో అంత ఏడిపించేసావ్.. మీ అభిమానిగా మారిపోతున్నాను. నీతో వర్క్ చేయడాని ఎక్కువ సమయం ఆగలేను అంటూ బన్నీపై ప్రశంసలు కురిపించింది. మరి ఒక బాలీవుడ్ డైరెక్టర్ నుండి ఇలాంటి ప్రశంసలు దక్కడం అంటే గొప్ప విషయమే కదా.. మరి బన్నీ ఆ ఛాన్స్ ఎప్పుడు ఇస్తాడో చూద్దాం.


[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =