“భజరంగి 2” మూవీ టీజర్ రిలీజ్

Kannada Super Star Shiva RajKumar Latest Movie Bhajagarangi 2 Movie Team Releases Interesting Update

ఫిల్మ్ ఎంటర్ టైనర్స్ పాత్ బ్యానర్ పై ఏ. హర్ష దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన ఫాంటసీ యాక్షన్ “భజరంగి ” మూవీ 2013 సంవత్సరం డిసెంబర్ 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ “భజరంగి 2” మూవీ రూపొందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సేమ్ బ్యానర్ పై ఏ. హర్ష దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, భావన జంటగా భారీ బడ్జెట్ తో పీరియాడిక్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా “భజరంగి 2” మూవీ తెరకెక్కింది. శివ రాజ్ కుమార్ బర్త్ డే సందర్భంగా “భజరంగి 2” మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ కు అద్భుత స్పందన లభించింది. టీజర్ లోని గ్రాఫిక్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజర్ కు వచ్చిన అద్భుత స్పందన చూసి “భజరంగి 2” మూవీ ని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ .. “భజరంగి ” మూవీ సూపర్ హిట్ కావడంతో “భజరంగి 2” మూవీ ని భారీ బడ్జెట్ తో రూపొందిందని , టీజర్ కు వచ్చిన స్పందనకు సంతోషంగా ఉందని , అందరికీ ధన్యవాదాలు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 4 =