చిత్ర పరిశ్రమలో మరో కొత్త శాఖ

Film Industry Brings COVID Protection System Department To Take End To End Care Of Unit Members During The Film Shootings

కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ సంక్షోభం లో చిక్కుకున్న విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమ పై ఆధారపడ్డ కార్మికులు పలు అవస్థలకు గురిఅవుతున్నారు. షూటింగ్స్ కు అనుమతి వచ్చినా పెద్ద సినిమాలు సెట్స్ పైకి వెళ్ళడం లేదు. కరోనా కష్ట పరిస్థితులలో కళ తప్పిన చిత్ర పరిశ్రమ గాడిన పడేందుకు కొత్త ఆలోచనలు చేస్తుంది. 24 విభాగాలుగా ఉన్న చిత్ర పరిశ్రమ మరో కొత్త విభాగానికి తెరతీసింది. అదే కోవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ . సురక్షిత వాతావరణంలో షూటింగ్ కొనసాగించేందుకు చిత్ర పరిశ్రమ కోవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇన్ డోర్ , అవుట్ డోర్ లలో జరిగే షూటింగ్స్ పూర్తి రక్షణ తీసుకునే విభాగంగా కోవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ రూపొందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలకు అనుగుణంగా షూటింగ్స్ సజావుగా సాగేందుకు ఈ శాఖ తోడ్పడుతుంది. షూటింగ్ జరుగుతున్న లొకేషన్ ను హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజ్ చేయడం , షూటింగ్ జరిగినన్ని రోజులూ నటీనటులు , టీమ్ కూ వారానికి ఒకసారి కరోనా పరీక్ష చేయడం, షూటింగ్ లొకేషన్ లో డాక్టర్ ను , అంబులెన్స్ ను అందుబాటులో ఉంచడం , అత్యున్నత ప్రమాణాలతో రూపొందిన శాని టైజర్, మాస్క్ లు ప్రతీ ఒక్కరికీ అందించడం , ప్రతీ ఒక్కరి ఆరోగ్య స్థితిని తెలుసుకోగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వంటి విధులను కోవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ శాఖ నిర్వహిస్తుంది. ఈ శాఖతో ధైర్యంగా షూటింగ్స్ జరుపుకునే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.