‘లూసిఫర్’ రీమేక్ – ‘చిరు’ని ఢీకొట్టే పాత్రలో ‘రెహ్మాన్’..!

Veteran Actor Rahman To Reprise The Role Of Vivek Oberoi In Lucifer Telugu Remake

మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ‘సాహో’ ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో పాత్రలో రోజుకో వార్త వింటూనే వున్నాం. ఇక ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘లూసిఫర్’ మలయాళ వెర్షన్‌లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ పాత్రను తెలుగులో ప్రముఖ నటుడు రెహ్మాన్ పోషించనున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. రామ్ చరణ్, డైరెక్టర్ సుజీత్ రెహ్మాన్ ను ఇప్పటికే సంప్రదించారని.. ఈ పాత్ర చేయడానికి రెహమాన్‌ కూడా ఆసక్తి చూపించారని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

ఇక రెహ్మాన్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. మలయాళంలో ఒకప్పుడు స్టార్ హీరో. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. ఈ మధ్య కాలంలో ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో రామ్ చరణ్‌కు ఆయన తండ్రిగా నటించారు. ‘జనతా గ్యారేజ్’, ‘అంతరిక్షం’ సినిమాల్లోనూ ఆయన కనిపించారు.

ప్రస్తుతం చిరు కొరటాలతో ఆచార్య సినిమాతో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే ‘లూసిఫర్’ రీమేక్ సెట్స్ పైకి వెళ్లనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + five =