కొంతమంది నటీనటులు ఎన్నో ఏళ్ళ నుండి సినీ పరిశ్రమలో పని చేస్తుంటారు కానీ కొంతమందికి ఏదో ఒక పాయింట్ దగ్గర బ్రేక్ వస్తుంది. నటుడు సోనూసూద్ విషయంలో కూడా ఇదే జరిగినట్టు కనిపిస్తుంది. నిజానికి ఇప్పుడు సోనుసూద్ అంటే మనకు మొదట గుర్తొచ్చే క్యారక్టర్ పశుపతి. వదల బొమ్మాళి అంటూ సోనుసూద్ చేసిన నటన తన కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఇలాంటి పాత్రలు ఒక్కసారే వస్తాయి. అరుంధతి సినిమా ముందు మనకి సోను సూద్ అంటే పూరీ జగన్నాధ్ సినిమా సూపర్ గుర్తొస్తుంది. ఈ సినిమా కూడా సోను సూద్ కు మంచి గుర్తింపునిచ్చింది. కానీ అరుంధతి మాత్రం కెరీర్ ను మార్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే… సూపర్ సినిమాకంటే ముందే సోను సూద్ మరో తెలుగు సినిమాలో నటించాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా హ్యాండ్సప్ సినిమా. 1999లో ‘కలైజ్ఞర్’, ‘నెంజిలే’ చిత్రాలతో తమిళంలోకి అడుగుపెట్టాడు సోనూ. ఆ తర్వాత తెలుగులో ‘హ్యాండ్సప్’ అనే చిత్రం చేశారు. ఆశర్యంగా వుంది కదా. నాగబాబు, బ్రహ్మానందం, జయసుధ ప్రధాన పాత్రల్లో దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ సినిమాలో తుగ్లక్ పాత్రలో నటించాడు. నిజానికి ఈ విషయం చాలామందికి తెలుసుండకపోవచ్చు. కానీ అప్పట్లోనే సోనూ సూద్ తెలుగు సినిమాల్లో నటించాడు. అయితే పెద్దగా గుర్తింపు రాలేదనుకోండి ఆ తర్వాత సూపర్.. ఆ తర్వాత ‘అతడు’, ‘అశోక్’ చిత్రాలతో అదరగొట్టారు. ఇక అరుంధతి తర్వాత ఎన్నో సినిమాలు క్యూ కట్టాయి. ‘ఆంజనేయులు’, ‘ఏక్ నిరంజన్’, ‘కందిరీగ’, ‘దూకుడు’ చిత్రాల్లో సోనూసూద్ పాత్రలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘అరుంధతి’లో నటనకిగానూ ఉత్తమ ప్రతినాయకుడిగా తెలుగులో నంది అవార్డు కూడా దక్కింది.
ఇక 2016లో తన తండ్రి శక్తిసాగర్ పేరుతో శక్తిసాగర్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థనిప్రారంభించి. ‘అభినేత్రి’కి హిందీ వర్షన్‌గా తెరకెక్కిన ‘తూటక్ తూటక్ తూటియా’ అనే చిత్రాన్ని నిర్మించారు. జాకీచాన్‌తో కలిసి నటించిన ‘కుంగ్‌ఫు యోగా’ చిత్రాన్ని కూడా హిందీలో ఆయనే సొంతంగా విడుదల చేశారు.
ఇక రీల్ లైఫ్ లో విలన్ పాత్రల్లో నటించినా రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు సోనూ. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ఎంతోమందికి బాసటగా నిలిచాడు. ఎంతోమంది వలస కార్మికులను ప్రత్యేక బస్సులు, రైళ్లు, ఫ్లైట్లలో వారి స్వస్థలాలకు చేర్చారు. ఇప్పుడు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికుల కుటుంబాలకు అండగా నిలవనున్నాడు. సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తానని తాజాగా ప్రకటించాడు. దీనితో సోనూ సూద్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: