‘కె.జి.యఫ్ 2’ కోసం అడగలేదు…!

I Was Not Approached By KGF2 Team For The Role Of Adhera In The Movie Clarifies Eega Fame Actor Kichcha Sudeep

పెద్ద సినిమా అంటే రూమర్స్ ఆపడం కష్టమే. ఏదో ఒక రూమర్ వెంట వెంటనే వస్తూనే ఉంటాయి. దర్శకనిర్మాతలు ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా వాటిని ఆపడం కష్టమే. ఇక కె.జి.యఫ్ 2 సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది. ఏదో ఒక రూమర్ వస్తూనే వుంది ఈ సినిమాపైనా. మొన్నటివరకు రిలీజ్ విషయంలో పలు వార్తలు రాగా ఇప్ప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో అధీర పాత్ర ఉందన్న సంగతి తెలిసిందే కదా. ఈ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ చేస్తున్న విషయం కూడా విదితమే. ఈ నేపథ్యంలో ‘అధీరా’ పాత్ర కోసం ముందుగా కన్నడ స్టార్ హీరో సుదీప్‌ను సంప్రదించారనే వార్త గత రెండు రోజులుగా చక్కర్లు కొడుతుంది. ఇక ఈ వార్తలపై సుదీప్ స్పందిస్తూ..ఆ వార్తలలో నిజంలేదు… ఈ సినిమాలో అధీర పాత్ర కోసం నన్ను ఎవ్వరూ సంప్రదించలేదు. కె.జి.ఎఫ్ చాప్టర్ 1 కోసం మాత్రం సినిమా చూడటానికి ఆహ్వానం పంపించారు. అంతే తప్ప అధీర పాత్రపై వస్తున్న వార్తలలో నిజం లేదు. ఇక ‘అధీరా’ పాత్ర సంజయ్‌దత్ సార్ చేస్తున్నారని తెలిసింది. ఆయన చేస్తున్నాడంటే ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది. ఈ విషయంలో నేను చాలా హ్యాపీ..’’ అని క్లారిటీ ఇచ్చాడు సుదీప్.

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా వచ్చిన `కె.జి.ఎఫ్‌- చాప్ట‌ర్ 1` సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అదే జోష్ తో `కె.జి.ఎఫ్‌- చాప్ట‌ర్ 2′ కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ వర్క్ అవుట్ అవుతుందో.మరి చాప్టర్ 1 సూపర్ హిట్ అవడంతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చుద్దాం.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here