
ట్యాగ్ · 48 కథనాలు · పేజీ 3

ఆ సినిమాలో నేను లేను.. అందులో నిజం లేదు..!
రష్మిక పై సమంత ప్రశంసలు
రానా పెళ్లికి ముహూర్తం ఫిక్స్

వలస కార్మికుల కోసం నిధి అగర్వాల్
బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో గుర్తింపు పొందిన నిధి అగర్వాల్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నిధి ప్రస్తుతం అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ, జయం రవి హీరోగా రూపొందుతున్న "భూమి " తమిళ మూవీ లో నటిస్తున్నారు. "భూమి " తమిళ మూవీ తో నిధి కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
ఆ సినిమాలో నేను లేను.. అందులో నిజం లేదు..!
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. అర్జునరెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.
తెలుగు తెరపై మరో బయోపిక్ - ఈసారి 'కరణం మల్లీశ్వరి' పై
ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్ ఇలా పలు ఇండస్ట్రీల్లో ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, క్రీడా ప్రముఖులు ఇలా చాలా మంది జీవిత చరిత్రలే తెరకెక్కాయి. ఇంకా చాలా మంది బయోపిక్ లు లైన్ లో వున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు టాలీవుడ్ లో మరో బయోపిక్ తెరపైకి వచ్చింది. కరణం మల్లీశ్వరి బయోపిక్ ను రూపొందనున్నారు.
"జిగర్తాండ" హిందీ రీమేక్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ?
గ్రూప్ కంపెనీ బ్యానర్ పై కథిరేసన్ నిర్మాతగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సిద్ధార్థ్ , బాబీ సింహా ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "జిగర్తాండ" తమిళ మూవీ ఘనవిజయం సాధించింది. "జిగర్తాండ" తమిళ మూవీ తెలుగు రీమేక్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, అథర్వ ప్రధాన పాత్రలలో రూపొందిన "గద్దలకొండ గణేష్"మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు "జిగర్తాండ" తమిళ మూవీ హిందీ లో రీమేక్ కానుంది.
రష్మిక పై సమంత ప్రశంసలు
బ్లాక్ బస్టర్ "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " వంటి మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప " మూవీ లో నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా రూపొందిన "పొగరు "(కన్నడ ), "సుల్తాన్" (తమిళ ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. "సుల్తాన్" తమిళ మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
గొప్ప నటుడిగా.. మంచి తండ్రిగా.. గొప్ప భర్తగా గుర్తుపెట్టుకోవాలని నా కోరిక..!
ఇన్ని రోజులు తమ హీరో సినిమా అప్ డేట్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు మహేష్ తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. తన తర్వాత పరుశురాం దర్శకత్వంలో ఉండబోతుందని చెప్పిన చిత్రయూనిట్... నిన్న సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్ ను కూడా రిలీజ్ చేశారు. 'సర్కారు వారి పాట' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా నిన్న మహేష్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు మహేష్ పలు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. మరి…
రానా పెళ్లికి ముహూర్తం ఫిక్స్
మొత్తానికి అనుకున్నదే జరిగింది. రానా-మిహికాల పెళ్లి డిసెంబర్ లో పెళ్లి అనుకుంటున్నారు కానీ రానా స్పీడ్ చూసి డిసెంబర్ కంటే ముందే జరగొచ్చు అన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు అదే జరిగింది. రానా పెళ్లి ముహుర్తాన్ని ఫిక్స్ చేసేశారు. ఆగస్టు 8న వీరి వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. ఇరువురి కుటుంబ పెద్దలు ఆ రోజున మంచి ముహూర్తం ఉండడంతో పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారట. ఈ సందర్భంగా రానా తండ్రి సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘అవును... మా అబ్బాయి పెళ్లి ఆగస్టు 8న ముహూర్తం ఫిక్స్ చేసాం.. మంచి ముహూర్తం కుదిరింది. హైదరాబాద్‌లోనే పెళ్లి వేడుక ఉంటుంది. కరోనా కారణంగా ఎక్కడికీ వెళ్లడానికి లేదు కాబట్టి.. ప్రభుత్య…

సూపర్ స్టార్ కృష్ణకు ఆ గౌరవం ఇప్పుడు కాకుంటే ఇంకెప్పటికో...!?
మే 31... సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు... ఈ సందర్భంగా మీడియా అభినందన వ్యాసాలు రాస్తాయి. కృష్ణ చలన చిత్ర జీవిత విశేషాలను పునరావృతంగా కీర్తిస్థాయి. అయితే ప్రస్తుత సందర్భంలో కావాల్సింది అందరికీ తెలిసిన ఆయన ఘనతను కీర్తించడం కాదు. ఆయన ఘనతకు తగిన ఒక జాతీయ పురస్కారం ఆయనను వరించేందుకు అవసరమైన ప్రాతినిధ్య వ్యాసాలు రాయటం అవసరం.