కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 124

Prabhu Deva's Premikudu Ready For Worldwide Grand Re Release
సినిమా వార్తలు

ప్రేమికుడు.. రీ రిలీజ్‌కి సిద్ధం, ఎప్పుడంటే?

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఈ లిస్టు లోకి ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సినిమా చేరింది. సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ 'ప్రేమికుడు' సినిమా త్వరలో రీ-రిలీజ్ అవబోతోంది. 30 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 13న థియేటర్లలో ఘనంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
NTR Meets Star Directors Ayan Mukerji and Prashanth Neel in Mumbai For Devara Promotions
సినిమా వార్తలు

దేవర ప్రమోషన్స్.. స్టార్ డైరెక్టర్స్‌తో ఎన్టీఆర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'దేవర'. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉండటంతో యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి సారించింది. దీనిలో భాగంగా తారక్ ముంబై పయనమై వెళ్లారు. అక్కడ పలువురు సెలబ్రీటీలను కలుసుకుంటున్నారు. సోమవారం 'యానిమల్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగాను కలుసుకున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Manasilaayo The First Single Released From Vettaiyan
సినిమా వార్తలు

వేట్టైయాన్‌ ఫ‌స్ట్ సింగిల్‌ రిలీజ్, అదరగొట్టిన సూపర్ స్టార్

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వేట్టైయాన్‌'. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్‌' ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్‌ టీజర్‌ సినిమాపై సూపర్ హైప్‌ క్రియేట్ చేసింది. దుషారా విజయన్‌, రితికా సింగ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Priyadarshi’s Sarangapani Jathakam Movie Wraps up Its Shoot
షూటింగ్ అప్‌డేట్

ప్రియదర్శి సారంగపాణి జాతకం షూటింగ్ కంప్లీట్

శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో ఇదివరకే 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' లాంటి చక్కటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. తాజాగా వాళ్లిద్దరి కలయికలో యంగ్ హీరో ప్రియదర్శి కథానాయకుడిగా మరో చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు 'సారంగపాణి జాతకం' అనే టైటిల్ ఖరారు చేశారు.

Srikanth Mవాట్సాప్
Janaka Aithe Ganaka Movie Team Announced New Release Date
రిలీజ్ అప్‌డేట్

జనక అయితే గనక.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఈ సినిమాతో మరో హిట్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్‌ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాను శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి గ్రాండ్‌గా నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Kannappa Team Unleashed Akshay Kumar's Pre Look on His Birthday
ఫస్ట్ లుక్

అక్షయ్ కుమార్‌ బర్త్ డే.. కన్నప్ప నుంచి ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్‌డేట్‌ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేయగా.. అవన్నీ మంచి హైప్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Victory Venkatesh, Anil Ravipudi Combo Movie Pollachi Schedule Wrapped Up
షూటింగ్ అప్‌డేట్

వెంకీ, అనిల్ రావిపూడి మూవీ లేటెస్ట్ అప్‌డేట్‌

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబోలో మూడో చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ అందింది. గత కొన్ని రోజులుగా పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం ఈ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

Srikanth Mవాట్సాప్
Saripodhaa Sanivaaram Break even done in all areas
సినిమా వార్తలు

సరిపోదా శనివారం బ్రేక్ ఈవెన్ కంప్లీట్

నాని సరిపోదా శనివారం రెండో వారంలోకూడా అదరగొడుతుండడంతో నిన్నటితో ఈసినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.గత నెల 29న విడుదలై పాజిటివ్ రివ్యూస్ కు తోడు సూపర్ మౌత్ టాక్ ను తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హోల్డ్ ను కొనసాగిస్తుంది.ప్రపంచ వ్యాప్తంగా 11రోజుల్లో 90కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.దేవర వచ్చే వరకు పెద్ద సినిమాల రిలీజ్ కూడా లేకపోవడంతో సరిపోదా లాంగ్ రన్ కన్ఫర్మ్.

Mahender Reddyవాట్సాప్
Star Boy Siddhu Jonnalagadda's JACK - Konchem Crack Shooting Update
షూటింగ్ అప్‌డేట్

సిద్ధు జొన్నలగడ్డ 'జాక్- కొంచెం క్రాక్’ షూటింగ్ అప్‌డేట్‌

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.. రీసెంట్‌గా 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయ‌న క‌థాయ‌కుడిగా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేయ‌టానికి ఇష్ట‌ప‌డే సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబోలో మ‌రో కొత్త జోన‌ర్ మూవీగా ఇది తెర‌కెక్కుతోంది. ఆడియెన్స్‌కు ఓ స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించే చిత్రంగా జాక్ రూపొందుతోంది.

Srikanth Mవాట్సాప్
KA worldwide Malayalam version release by Wayfarer films
సినిమా వార్తలు

క థియేట్రికల్ హక్కులు దక్కించుకున్న స్టార్ హీరో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నుండి వస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ క.టీజర్ ఈసినిమాఫై అంచనాలు పెంచేసింది.రీసెంట్ విడుదలైన ఫస్ట్ సాంగ్ కూడా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.దాంతో క థియేట్రికల్ రైట్స్ డిమాండ్ వస్తుంది.ఈసినిమా పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
AAY OTT Platform and Release Date Announced
ఓటీటీ

ఓటీటీలోకి ఆయ్.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ‘మ్యాడ్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన సోలో హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆయ్’. ‘మేం ఫ్రెండ్సండి’ అనేది ట్యాగ్ లైన్‌. విడుదలకు ముందే ప్రచారచిత్రాలతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్ అనిపించుకుంది.

Srikanth Mవాట్సాప్
Nava Dalapathy Sudheer Babu's Maa Nanna Superhero Teaser Release Date Announced
ట్రైలర్ & టీజర్

మా నాన్న సూపర్ హీరో టీజర్ వచ్చేస్తోంది

నవ దళపతి సుధీర్ బాబు తన తదుపరి విహారయాత్ర మా నాన్న సూపర్‌హీరోతో భావోద్వేగాల రోలర్‌కోస్టర్ రైడ్‌ను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి.సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
KAANTHA movie has been launched
సినిమా వార్తలు

కాంత మూవీ లాంచ్

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించనున్న కాంత నిన్న లాంచ్ అయ్యింది.ఈసినిమాకు రానా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేయనుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించనుంది.1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా రానుంది.రానా తో పాటు దుల్కర్ సల్మాన్ ఈసినిమాను నిర్మించనున్నారు.త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుండగా పాన్ ఇండియా మూవీ గా వచ్చే ఏడాది విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
Kannada Superstar Shiva Rajkumar Launched Subrahmanyaa First Look Poster
ఫస్ట్ లుక్

శివ రాజ్‌కుమార్ చేతులమీదుగా.. సుబ్రహ్మణ్య ఫస్ట్ లుక్‌

వెండితెరకు మరో వారసుడు పరిచయం అవుతున్నాడు. పాపులర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి. రవిశంకర్ కుమారుడు అద్వయ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు 'సుబ్రహ్మణ్య' అనే టైటిల్ ఖరారు చేశారు. పాన్ ఇండియా మూవీ సుబ్రహ్మణ్య తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Mr Bachchan is coming to Netflix on 12 September
ఓటీటీ

మిస్టర్ బచ్చన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

మాస్ మహారాజా రవితేజ,డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా మిస్టర్ బచ్చన్.హిందీ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమా గత నెల15న విడుదలై నిరాశపరిచింది.మంచి అంచనాలతో వచ్చిన ఈసినిమా అనుకున్న సక్సెస్ కాలేకపోయింది.ఇక ఈసినిమా ఓటిటిలోకి వచ్చేస్తుంది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈనెల 12నుంచి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.తెలుగుతోపాటు కన్నడ,మలయాళ,తమిళ భాషల్లో మిస్టర్ బచ్చన్ అందుబాటులోకి రానుంది.ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.

Mahender Reddyవాట్సాప్
Jr NTR and Sandeep Reddy Vanga meets in Mumbai
సినిమా వార్తలు

సందీప్ రెడ్డితో ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర.కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.ఈసినిమా రెండు భాగాలుగా విడుదలకానుండగా ఫస్ట్ పార్ట్ఈనెల 27న రానుంది.రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది టీం.అందులో భాగంగా రీసెంట్ గా రిలీజైనా సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.రేపు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.ఇందుకోసం ఎన్టీఆర్ ఇప్పటికే ముంబై చేరుకున్నాడు.రేపు అక్కడ ట్రైలర్ ఈవెంట్ జరుపనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Roshan Kanakala New Film Title and First Look Poster Revealed
ఫస్ట్ లుక్

రోషన్ కనకాల కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

'బబుల్‌గమ్' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ కనకాల.. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులో, తన పెర్ఫార్మెన్స్, డ్యాన్స్ లతో ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌ కోసం 'కలర్ ఫోటో'తో జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్‌తో కలిసి పనిచేసేందుకు సిద్దమయ్యాడు. ఈ యంగ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సందీప్ రాజ్, ఈ సినిమా కోసం మరోక అద్భుతమైన కథను రెడీ చేశారు.

Srikanth Mవాట్సాప్
Dulquer Salmaan's Lucky Baskhar New Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

లక్కీ భాస్కర్ వచ్చేది ఆరోజే..!

మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అప్పటినుంచీ ఆయన తరచుగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. 'సీతారామం' చిత్రంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ అందుకున్న దుల్కర్.. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన 'కల్కి 2898 ఏడీ`మూవీలో గెస్ట్ రోల్‌‌లో కనిపించి సర్ప్రైజ్‍ చేశాడు. ఈ క్రమంలో దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్‌’.

Srikanth Mవాట్సాప్
Game Changer Second Single to be Released This September
సినిమా వార్తలు

గేమ్‌ ఛేంజర్‌.. సెకండ్ సింగిల్ అప్‌డేట్‌

గ్లోబల్ స్టార్‌ రామ్‌ చ‌ర‌ణ్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, స‌ముద్రఖని, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Devara Trailer Release Update
ట్రైలర్ & టీజర్

దేవ‌ర ట్రైల‌ర్ వచ్చేస్తోంది

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. భైరా అనే ప్రతినాయకుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో కనిపించనున్నారు. అలాగే ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచ‌ల‌నాల‌ను క్రియేట్ చేస్తోంది. అభిమానులు స‌హా అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్