నాని సరిపోదా శనివారం రెండో వారంలోకూడా అదరగొడుతుండడంతో నిన్నటితో ఈసినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.గత నెల 29న విడుదలై పాజిటివ్ రివ్యూస్ కు తోడు సూపర్ మౌత్ టాక్ ను తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హోల్డ్ ను కొనసాగిస్తుంది.ప్రపంచ వ్యాప్తంగా 11రోజుల్లో 90కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.దేవర వచ్చే వరకు పెద్ద సినిమాల రిలీజ్ కూడా లేకపోవడంతో సరిపోదా లాంగ్ రన్ కన్ఫర్మ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాను దిల్ రాజు విడుదలచేయగా ఫుల్ రన్ లో మంచి లాభాలను సొంతంచేసుకోనున్నాడు.ఈసినిమా అటు ఓవర్సీస్ లో కూడా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.నార్త్ అమెరికాలో నిన్నటితో 2.4 మిలియన్ డాలర్ వసూళ్లను రాబట్టుకొని నానికి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందించింది.యాక్షన్ ఎంటర్టైనర్ గా వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఎస్ జె సూర్య విలన్ గా చేశాడు.జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.డివివి ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది.
నాని ఈసినిమాతో హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు.గత ఏడాది దసరా,హాయ్ నాన్నలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ చూశాడు.ప్రస్తుతం నాని,హిట్3 లో నటించడానికి రెడీ అవుతున్నాడు.శైలేష్ కొలను డైరెక్ట్ చేయనుండగా నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాస్ నిర్మిస్తుంది.ఈసినిమాతో పాటు నాని,దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మరో సినిమా చేయనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: