గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఆర్సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా గణేష్ చతుర్థి సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్డేట్ అందించారు. త్వరలోనే ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సెప్టెంబర్‌లోనే సెకండ్ సింగిల్ రానున్నట్టు తెలియజేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఇప్పటినుంచే దీనికోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
కాగా గేమ్ ఛేంజర్ సినిమాకు మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ‘జరగండి.. జరగండి’ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో రెండో పాటపై మూవీ లవర్స్ ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు. సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు.
ఇక ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందించగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకానుంది. ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్, పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























