కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

అక్షయ్ కుమార్‌ బర్త్ డే.. కన్నప్ప నుంచి ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్

Kannappa Team Unleashed Akshay Kumar's Pre Look on His Birthday
ఫస్ట్ లుక్1 ని. చదువు

అక్షయ్ కుమార్‌ బర్త్ డే.. కన్నప్ప నుంచి ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్

Kannappa Team Unleashed Akshay Kumar’s Pre Look on His Birthday

Kannappa Team Unleashed Akshay Kumar's Pre Look on His Birthday

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్‌డేట్‌ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేయగా.. అవన్నీ మంచి హైప్ క్రియేట్ చేశాయి.

ఈ క్రమంలో తాజాగా మరో పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను టీమ్ విడుదల చేసింది. సోమవారం (సెప్టెంబర్ 9) బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'కన్నప్ప' టీమ్ ఆయనకు స్పెషల్‌ సర్‌ప్రైజ్ అందించింది. ఆయన పోషించిన శివుని పాత్రకి సంబంధించిన ప్రీ లుక్‌ను రిలీజ్ చేసింది. కాగా కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

ఈ పోస్టర్ గమనిస్తే.. రుద్రాక్ష మాలతో అలంకరించబడిన కైలాసవాసుడి చేతిని చూపించారు. ముల్లోకాలను ఏలే పరమేశ్వరుడు.. భక్తికి మాత్రం దాసుడు అంటూ.. శివుని తత్త్వం గురించి వివరించే డైలాగ్ పోస్టర్ మీద పెట్టారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం ఉంది. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు తిన్నడు పాత్రతో వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్