నవ దళపతి సుధీర్ బాబు తన తదుపరి విహారయాత్ర మా నాన్న సూపర్‌హీరోతో భావోద్వేగాల రోలర్‌కోస్టర్ రైడ్‌ను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి.సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మా నాన్న సూపర్ హీరోలో సుధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్‍గా నటిస్తోంది. అలాగే సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. కాగా ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ ఫస్ట్-లుక్ పోస్టర్‌లో సుధీర్ బాబు ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడి అవతార్‌లో కూరగాయలు తీసుకెళ్తూ స్కూటర్‌ను నడుపుతున్నాడు. చిరునవ్వులు చిందిస్తూ తనకు ఎదురైన పాఠశాల పిల్లలను పలకరిస్తూ కనిపించాడు. ఈ పోస్టర్‌తో పాటు సినిమా టీజర్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను కూడా అందించారు మేకర్స్. సెప్టెంబర్ 12న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఇక ఈ సినిమాకి MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర కో రైటర్స్ కాగా.. రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రాఫీతో పాటు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, అనిల్ కుమార్. పి ఎడిటర్‌గా, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్‌గా, మహేశ్వర్ రెడ్డి గోజాల క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. రిలీజ్ కి సమయం దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ని త్వరలోనే ప్రారంభించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: