మాస్ మహారాజా రవితేజ,డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా మిస్టర్ బచ్చన్.హిందీ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమా గత నెల15న విడుదలై నిరాశపరిచింది.మంచి అంచనాలతో వచ్చిన ఈసినిమా అనుకున్న సక్సెస్ కాలేకపోయింది.ఇక ఈసినిమా ఓటిటిలోకి వచ్చేస్తుంది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈనెల 12నుంచి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.తెలుగుతోపాటు కన్నడ,మలయాళ,తమిళ భాషల్లో మిస్టర్ బచ్చన్ అందుబాటులోకి రానుంది.ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ కాకముందే రవితేజ తన 75వ సినిమా మొదలు పెట్టిన విషయం తెలిసిందే.అయితే ఇటీవల చేతికి శస్త్ర చికిత్స చేసుకోవడంతో ప్రస్తుతం రవితేజ విశ్రాంతి తీసుకుంటున్నాడు.త్వరలోనే షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.భాను బోగవరపు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.నాగ వంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈసినిమాను సంక్రాంతి బరిలో నిలుపేలా ప్లాన్ చేస్తున్నారు.
అటు హరీష్ శంకర్,ఉస్తాద్ భగత్ సింగ్ స్క్రిప్ట్ లో మరోసారి మార్పులు చేస్తున్నాడు.ఇప్పటివరకు కేవలం 20శాతం షూటింగ్ మాత్రమే జరిగింది.సెట్స్ మీదకు వెళ్లిన కొద్దీ రోజులకే షూటింగ్ కి బ్రేక్ పడడంతో ఈ గ్యాప్ లో హరీష్,మిస్టర్ బచ్చన్ తీశాడు.త్వరలోనే ఉస్తాద్ షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీ లీల ఓ హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: