రోషన్ కనకాల కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

Roshan Kanakala New Film Title and First Look Poster Revealed

‘బబుల్‌గమ్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ కనకాల.. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులో, తన పెర్ఫార్మెన్స్, డ్యాన్స్ లతో ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌ కోసం ‘కలర్ ఫోటో’తో జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్‌తో కలిసి పనిచేసేందుకు సిద్దమయ్యాడు. ఈ యంగ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సందీప్ రాజ్, ఈ సినిమా కోసం మరోక అద్భుతమైన కథను రెడీ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా వినాయక చతుర్థి శుభ సందర్భంగా ఈ న్యూ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో రోషన్ కనకాల యూనిక్ రోల్ లో కనిపించనున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ ఎక్సయిటింగ్ మూవీకి ‘మోగ్లీ’ అనే పేరుతో టైటిల్ ఖరారు చేశారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ గమనిస్తే.. రోషన్ కనకాల వెస్ట్ ధరించి, సాలిడ్ ఫిజిక్, దట్టమైన అడవిలో గుర్రంతో పాటు చిరునవ్వుతో కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ అదిరిపోయింది. విజువల్ గా పోస్టర్ కట్టిపడేసింది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు, కలర్ ఫోటో కు సక్సెస్ఫుల్ ఆల్బమ్‌ అందించిన కాల భైరవ సంగీతం సందిస్తున్నారు.

‘బాహుబలి1 & 2’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్‌లకు చీఫ్ అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ రామ మారుతి, సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. కలర్ ఫోటో, మేజర్,అప్ కమింగ్ గూఢచారి 2 హిట్ చిత్రాలకు ఎడిటర్ అయిన పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి ఎడిటింగ్ చేయనున్నారు. కాగా ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, విజనరీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. 2025 సమ్మర్‌లో విడుదల చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.