ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర.కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.ఈసినిమా రెండు భాగాలుగా విడుదలకానుండగా ఫస్ట్ పార్ట్ఈనెల 27న రానుంది.రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది టీం.అందులో భాగంగా రీసెంట్ గా రిలీజైనా సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.రేపు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.ఇందుకోసం ఎన్టీఆర్ ఇప్పటికే ముంబై చేరుకున్నాడు.రేపు అక్కడ ట్రైలర్ ఈవెంట్ జరుపనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు ఎన్టీఆర్ ముంబైలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగని కలిశాడు.అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.వీరిద్దరూ క్యాజువల్ గా మీట్ అయ్యారా లేక దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఏమైనా ప్లాన్ చేస్తారనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది.అయితే ఈ మీట్ పై అప్పుడే రకరక ఊహాగానాలు మొదలయ్యాయి.
ప్రభాస్ తో స్పిరిట్ అయిపోయాక సందీప్ రెడ్డి ఎన్టీఆర్ తో సినిమా తీయనున్నాడని ప్రచారం మొదలయ్యింది.ఇప్పట్లో అయితే ఇది సాధ్యపడదు కానీ రానున్న రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ లేకపోలేదు.ఇక గత ఏడాది యానిమల్ తో బ్లాక్ బాస్టర్ కొట్టి నేషన్ వైడ్ గా పాపులర్ అయ్యాడు సందీప్ రెడ్డి.నెక్స్ట్ తను ప్రభాస్ తో స్పిరిట్ చేయనున్నాడు.వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: