కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

వేట్టైయాన్‌ ఫ‌స్ట్ సింగిల్‌ రిలీజ్, అదరగొట్టిన సూపర్ స్టార్

Manasilaayo The First Single Released From Vettaiyan

వేట్టైయాన్‌ ఫ‌స్ట్ సింగిల్‌ రిలీజ్, అదరగొట్టిన సూపర్ స్టార్

Manasilaayo The First Single Released From Vettaiyan

Manasilaayo The First Single Released From Vettaiyan

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వేట్టైయాన్‌'. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్‌' ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్‌ టీజర్‌ సినిమాపై సూపర్ హైప్‌ క్రియేట్ చేసింది. దుషారా విజయన్‌, రితికా సింగ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రానా దగ్గుబాటి, రావు రమేశ్‌, రోహిణి మొల్లేటి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుండి ఫ‌స్ట్ సింగిల్‌ రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు సహా కన్నడ, తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో దీనిని విడుదలచేశారు. సాంగ్ అయితే అదిరిపోయింది. సూపర్ స్టార్ తన స్టైల్ స్వాగ్ తో అలరించారు. ఇక ఈ పాటకు శ్రీనివాస మౌళి సాహిత్యం అందించగా.. నకాష్ అజీజ్, అరుణ్ కౌండిన్య, దీప్తి సురేష్ తదితరులు ఆలపించారు.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్ రవిచందర్‌ మ్యూజిక్‌ మరియు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. కాగా వేట్టైయాన్‌ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలచేయన్నారు మేకర్స్‌. ఇక ఇదిలావుంటే, మరోవైపు క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'తలైవా 171'గా తెరకెక్కుతోన్న 'కూలి' చిత్రంలో కూడా రజినీకాంత్ నటిస్తున్న విషయం తెలిసిందే.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్