కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

జనక అయితే గనక.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

Janaka Aithe Ganaka Movie Team Announced New Release Date

జనక అయితే గనక.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

Janaka Aithe Ganaka Team Announced The New Release Date

Janaka Aithe Ganaka Movie Team Announced New Release Date

టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఈ సినిమాతో మరో హిట్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్‌ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాను శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి గ్రాండ్‌గా నిర్మించారు.

సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలచేసిన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఇటీవలే జనక అయితే గనక ట్రైలర్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్‌తో సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. ఇక సెప్టెంబర్‌ 7న మూవీ రిలీజ్ కావాల్సివుండగా ఈ చిత్రం విడుదల వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా భారీ వరదలు సంభవించిన కారణంగా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జనక అయితే గనక సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ అందించారు మేకర్స్. సోమవారం కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 12వ తేదీన విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇక ఈ సినిమాలో సుహాస్‌కు జోడీగా సంగీర్తన ఫిమేల్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. రాజేంద్ర ప్ర‌సాద్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, గోప‌రాజు, ర‌ఘుబాబు, పృథ్వీ, శివ‌న్నారాయ‌ణ‌, రూప‌ల‌క్ష్మి, విజ‌య‌లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం సమకూరుస్తుండగా.. సాయి శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ, కోదాటి పవన్‌ కల్యాణ్‌ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అలాగే ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అరసవిల్లి రామ్‌కుమార్‌, కాస్ట్యూమ్ డిజైనర్‌గా భరత్‌ గాంధీ పనిచేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ మూవీ యుఎస్‌ఏ థియేట్రికల్ హక్కులను హీరో సుహాస్ స్వయంగా చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలావుంటే మరోవైపు సుహాస్ బాబీ దర్శకత్వంలో 'గొర్రె పురాణం' అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం కూడా విడుదలకానుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్