కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

శివ రాజ్‌కుమార్ చేతులమీదుగా.. సుబ్రహ్మణ్య ఫస్ట్ లుక్‌

Kannada Superstar Shiva Rajkumar Launched Subrahmanyaa First Look Poster
ఫస్ట్ లుక్2 ని. చదువు

శివ రాజ్‌కుమార్ చేతులమీదుగా.. సుబ్రహ్మణ్య ఫస్ట్ లుక్‌

Kannada Superstar Shiva Rajkumar Launched Subrahmanyaa First Look Poster

Kannada Superstar Shiva Rajkumar Launched Subrahmanyaa First Look Poster

వెండితెరకు మరో వారసుడు పరిచయం అవుతున్నాడు. పాపులర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి. రవిశంకర్ కుమారుడు అద్వయ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు 'సుబ్రహ్మణ్య' అనే టైటిల్ ఖరారు చేశారు. పాన్ ఇండియా మూవీ సుబ్రహ్మణ్య తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

కాగా ఈ చిత్రానికి పి. రవిశంకర్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేసేందుకు ఆయన సెకెండ్ టైమ్ మెగాఫోన్ పడుతున్నారు. 20 ఏళ్ల క్రితం ఆయన 2004లో 'దుర్గి' అనే కన్నడ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం చేశారు. ఇటీవలే విడుదల చేసిన ప్రీ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ నేపథ్యంలో తాజాగా వినాయక చతుర్థి సందర్భంగా సుబ్రహ్మణ్య నిర్మాతలు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కన్నడ సూపర్ స్టార్ డా. శివ రాజ్‌కుమార్ చేతులమీదుగా ఈ పోస్టర్ లాంచ్ చేయడం గమనార్హం. ఈ పోస్టర్‌లో అద్వయ్‌ని టైటిల్ రోల్‌లో సుబ్రహ్మణ్యగా పరిచయం చేశారు. పొడవాటి జుట్టు, గడ్డం,స్పెషల్‌గా డిజైన్ చేసిన అవుట్‌ ఫిట్స్‌లో అద్వయ్‌ అద్భుతంగా కనిపించాడు. తన లుక్స్‌లో ఇంటన్సిటీ కనిపిస్తోంది. విజువల్ ట్రీట్‌లా వున్న ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇక ఈ చిత్రం ఇప్పటికే 60% నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ విజువల్ అండ్ ఎమోషనల్ ట్రీట్‌గా అద్భుతమైన కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముంబయిలోని ప్రముఖ రెడ్ చిల్లీస్ స్టూడియోలో శరవేగంగా జరుగుతున్నాయి. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ప్రముఖ స్టూడియోలలో VFX & CGI పనులు జరుగుతున్నాయి.

సుబ్రహ్మణ్య సినిమా టెక్నికల్‌గా ఉన్నతంగా ఉండబోతుంది. దీనికి టాప్ నాచ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. కెజిఎఫ్, సాలర్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. విఘ్నేష్ రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ఎడిటర్‌గా విజయ్ ఎం కుమార్, సప్త సాగరదాచే & చార్లీ 777 ఫేమ్ ఉల్లాస్ హైదూర్ ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ జానర్‌లో నిర్మాతలు తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. శ్రీమతి ప్రవీణ కడియాల, శ్రీమతి రామలక్ష్మి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. 'గుణ 369' వంటి సక్సెస్‌ఫుల్ మూవీని నిర్మించిన ఎస్‌జి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 2గా ఇది తెరకెక్కుతోంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్