వెంకీ, అనిల్ రావిపూడి మూవీ లేటెస్ట్ అప్‌డేట్‌

Victory Venkatesh, Anil Ravipudi Combo Movie Pollachi Schedule Wrapped Up

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబోలో మూడో చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ అందింది. గత కొన్ని రోజులుగా పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం ఈ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నెల రోజులకు పైగా సాగిన లెన్తీ షెడ్యూల్‌లో, మేకర్స్ లీడ్ యాక్టర్స్ పై, పాటలు, యాక్షన్ పార్ట్‌తో కూడిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా వినాయక చతుర్థి సందర్భంగా, సెట్‌లోని ఛీర్ ఫుల్ ఎట్మాస్ఫీయర్ చూపించే గ్లింప్స్ ద్వారా అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసింది టీమ్. ప్రపంచ ప్రఖ్యాత నటుడు చార్లీ చాప్లిన్ కోట్ “a day without laughter is a day wasted” ను సూచిస్తూ చుట్టూ చిరునవ్వులతో, నటీనటుల మధ్య ఆనందాన్ని, స్నేహాన్ని వీడియో ప్రజెంట్ చేసింది.

ఈ మేకింగ్ వీడియోలో, వెంకటేష్ సంప్రదాయ దుస్తులలో కళ్లద్దాలతో కనిపిస్తుండగా.. ఐశ్వర్య రాజేష్, అతని భార్య భాగ్య పాత్రలో క్లాసిక్ చీరను ధరించింది. మీనాక్షి చౌదరి, ఎక్స్ లవ్ మీనాక్షి పాత్రలో మోడరన్ అవతార్‌లో కనిపించింది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కానుందని టీం చెప్పడంతో వీడియో ఎండ్ అవుతుంది. కాగా మున్నార్ దగ్గర ఇంటర్వెల్ సీక్వెన్స్ చిత్రీకరించారు దర్శకుడు అనిల్ రావిపూడి.

దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ కో -రైటర్స్. వి వెంకట్ యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తుండగా.. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కాబ్రా, చిట్టి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.