క థియేట్రికల్ హక్కులు దక్కించుకున్న స్టార్ హీరో

KA worldwide Malayalam version release by Wayfarer films

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నుండి వస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ క.టీజర్ ఈసినిమాఫై అంచనాలు పెంచేసింది.రీసెంట్ విడుదలైన ఫస్ట్ సాంగ్ కూడా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.దాంతో క థియేట్రికల్ రైట్స్ డిమాండ్ వస్తుంది.ఈసినిమా పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందులో భాగంగా క మలయాళ థియేట్రికల్ రైట్స్ ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీ వేఫరర్ ఫిలింస్ సొంతం చేసుకుంది.మలయాళంలో క సినిమాను వరల్డ్ వైడ్ గా ఈసంస్థ థియేట్రికల్ రిలీజ్ చేయనుంది.క ఫస్ట్ లుక్,టీజర్ చూసి దుల్కర్ సల్మాన్ ను మెప్పించడంతో మలయాళ వెర్షన్ తమ వేఫరర్ ఫిలింస్ సంస్థలో విడుదల చేసేందుకు ముందుకొచ్చారు.

ఇప్పటికే ఈసినిమా తెలుగు రైట్స్ ను నిర్మాత వంశీ నందిపాటి తీసుకున్నారు.ఇదే క్రమంలో త్వరలోనే తమిళ,కన్నడతో పాటు ఇతర భాషల బిజినెస్ క్లోజ్ కానుంది.సుజీత్,సందీప్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో ఆయ్ ఫేమ్ నయన్ సారిక అలాగే తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు.

ఇక ఈసినిమా విజయం కిరణ్ అబ్బవరం తప్పనిసరి కానుంది.కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయలతో దూసుకెళ్లిన కిరణ్ ఆ తరువాత తడబడ్డాడు.దాంతో క తో బ్లాక్ బాస్టర్ కొట్టి ఫామ్ లోకి రావాలని కిరణ్ పట్టుదలతో వున్నాడు.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.