కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

లక్కీ భాస్కర్ వచ్చేది ఆరోజే..!

Dulquer Salmaan's Lucky Baskhar New Release Date Announced

లక్కీ భాస్కర్ వచ్చేది ఆరోజే..!

Dulquer Salmaan’s Lucky Baskhar New Release Date Announced

Dulquer Salmaan's Lucky Baskhar New Release Date Announced

మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అప్పటినుంచీ ఆయన తరచుగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. 'సీతారామం' చిత్రంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ అందుకున్న దుల్కర్.. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన 'కల్కి 2898 ఏడీ`మూవీలో గెస్ట్ రోల్‌‌లో కనిపించి సర్ప్రైజ్‍ చేశాడు. ఈ క్రమంలో దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్‌’.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ 'శ్రీమతి గారు' విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను పెంచేశాయి. కాగా 1980-90 లలో ఉన్నత స్థాయికి చేరుకున్న ఓ సాధారణ బ్యాంక్‌ క్యాషియర్‌ కథాంశంగా రూపొందుతోంది. దీంతో నిర్మాతలు 80ల నాటి ముంబై నగరాన్ని హైదరాబాద్‌లో భారీ సెట్‌లతో నిర్మించినట్టు తెలుస్తోంది. అలాగే ఆ కాలం నాటి బ్యాంకులను పోలి ఉండే ఒక భారీ బ్యాంక్ సెట్‌ను కూడా రూపొందించినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో లక్కీ భాస్కర్‌ టీమ్ కీలక అప్డేట్ అందించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తెలుగు సహా తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్.

యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దుల్కర్‌ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా.. ప్రముఖ ఛాయగ్రాహకుడు నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మరియు ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్