టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ‘మ్యాడ్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన సోలో హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆయ్’. ‘మేం ఫ్రెండ్సండి’ అనేది ట్యాగ్ లైన్. విడుదలకు ముందే ప్రచారచిత్రాలతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను అందుకుంది. తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించి, ఓవరాల్‌గా రూ.15 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరికోసమే అన్నట్టుగా తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆయ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు మేకర్స్. సెప్టెంబర్ 12 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్టు నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. సో.. మూవీ లవర్స్, త్వరలోనే ఈ సినిమాను ఇంట్లోనే ఉండి వీక్షించే అవకాశాన్ని పొందండి.
గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో అంజి కె మణిపుత్ర దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇందులో నితిన్ సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా.. అంకిత్ కొయ్యా, కసిరెడ్డి రాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమాకు రామ్ మిర్యాల సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: