శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో ఇదివరకే ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ లాంటి చక్కటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. తాజాగా వాళ్లిద్దరి కలయికలో యంగ్ హీరో ప్రియదర్శి కథానాయకుడిగా మరో చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు ‘సారంగపాణి జాతకం’ అనే టైటిల్ ఖరారు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవలే టైటిల్‌తో పాటు హీరో ప్రియదర్శి ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలావుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ రోజుతో సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా అతను చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస చిత్రంగా ఈ ‘సారంగపాణి జాతకం’ రూపొందుతోంది.
ఇక ఈ సినిమాలో ప్రియదర్శి సరసన రూప కొడువాయూర్ కథానాయికగా నటిస్తుండగా.. నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమా సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉండనుంది. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పీజీ విందా కాగా.. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా రవీందర్, స్టంట్స్ మాస్టర్స్‌గా వెంకట్ – వెంకటేష్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: