మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ అనువాద చిత్రం `గజిని`తో తెలుగులోనూ మార్కెట్‌ని సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ సూర్య. ఆ తరువాత `యముడు` సిరీస్‌తో మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఈ టాలెంటెడ్ హీరో. ఇదిలా ఉంటే… ప్రస్తుతం సూర్య రెండు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి పొలిటికల్ థ్రిల్లర్ `ఎన్జీకే` కాగా… మరొకటి `కాప్పాన్`. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు చిత్రీకరణ తుది దశలో ఉన్నాయి. అంతేకాదు… కేవలం ఆరు నెలల గ్యాప్‌లో ఈ చిత్రాలు తెరపైకి రానున్నాయి.
శ్రీ రాఘవ దర్శకత్వంలో రూపొందుతున్న `ఎన్జీకే` ఏప్రిల్ 12న తెరపైకి రానుండగా… కె.వి.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న `కాప్పాన్` అక్టోబర్ నెలలో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ రెండు చిత్రాలు తెలుగులోనూ అనువాదం కానున్నాయి. కాగా… గత కొంత కాలంగా సినిమా సినిమాకి భారీ విరామమే తీసుకుంటున్న సూర్య… తదుపరి చిత్రాల విషయంలో ఆ గ్యాప్‌ని తగ్గిస్తుండడం విశేషమనే చెప్పాలి. సూర్య గత చిత్రం `గ్యాంగ్` గతేడాది సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే.
[youtube_video videoid=RfTNwFP6GeA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: