మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రంలో క‌ళ్యాణి?

Actress Kalyani Roped In For A Crazy Project?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Actress Kalyani To Feature in Crazy Project,Heroine Kalyani Upcoming Film News,Kalyani Priyadarshan Next Telugu Movie,Kalyani New Movies News,Kalyani Priyadarshan Upcoming Movies in 2019
Actress Kalyani Roped In For A Crazy Project?

`హ‌లో` చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్‌, ప్ర‌ముఖ‌ న‌టి లిజి గారాల ప‌ట్టి అయిన క‌ళ్యాణి… తొలి చిత్రంతోనే న‌టిగా మంచి మార్కులు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో రెండు చిత్రాల‌తో బిజీగా ఉంది. అందులో ఒక‌టి సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తున్న సినిమా కాగా… మ‌రొక‌టి సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న `చిత్ర‌ల‌హ‌రి`. వీటితో పాటు మ‌ల‌యాళంలో త‌న తండ్రి ప్రియ‌ద‌ర్శ‌న్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ `మ‌ర‌క్క‌ర్‌`లోనూ… దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్న `వాన్‌` అనే త‌మిళ చిత్రంలో న‌టిస్తోంది క‌ళ్యాణి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి కూడా క‌ళ్యాణి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని స‌మాచారం. `రెమో`, `సీమ‌రాజా` వంటి అనువాద చిత్రాల‌తో తెలుగు వారికి చేరువైన శివ‌కార్తికేయ‌న్ హీరోగా `అభిమ‌న్యుడు` ఫేమ్ పి.ఎస్‌.మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ త‌మిళ సినిమా రూపొంద‌నుంది. ఇందులోనూ హీరోయిన్‌గా న‌టించే ఛాన్స్ క‌ళ్యాణికి ద‌క్కింద‌ని టాక్‌. మొత్త‌మ్మీద‌… 2019లో క‌ళ్యాణి హ‌వా బాగానే ఉంద‌నే చెప్పాలి.

[subscribe]

[youtube_video videoid=HfCAOKaGzZg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − three =