
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 55


దేవర చివరి 40 నిమిషాలు అరాచకం -ఎన్టీఆర్

ట్రెండింగ్‌లో దేవర ట్రైలర్.. ఈ హైలైట్స్ గమనించారా?

జనక అయితే గనక సెకండ్ సింగిల్ అప్డేట్

సికిందర్ లో కాజల్ అగర్వాల్

ప్రభాస్ హను మూవీ షూటింగ్ అప్‌డేట్

కూలీ షూటింగ్ లో జాయిన్ అయిన నాగ్

దేవర ట్రైలర్ రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పించిన తారక్

నారా రోహిత్ సుందరకాండ ఫస్ట్ సింగిల్ అప్డేట్

దేవర.. అప్పుడే రికార్డుల వేట మొదలెట్టేశాడు

ది గోట్ సెన్సేషనల్ రన్ కంటిన్యూ

ప్రేమికుడు.. రీ రిలీజ్‌కి సిద్ధం, ఎప్పుడంటే?

దేవర ప్రమోషన్స్.. స్టార్ డైరెక్టర్స్‌తో ఎన్టీఆర్

ప్రియదర్శి సారంగపాణి జాతకం షూటింగ్ కంప్లీట్

జనక అయితే గనక.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

వెంకీ, అనిల్ రావిపూడి మూవీ లేటెస్ట్ అప్డేట్

శర్వా 37లో హీరోయిన్‌గా స్టార్ యాక్ట్రెస్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా 37వ చిత్రం (#శర్వా37) తెరకెక్కుతోంది. 'సామజవరగమన' సినిమాతో హిట్ అందుకున్న రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

దేవర చివరి 40 నిమిషాలు అరాచకం -ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర.దాదాపు 6ఏళ్ళ తరువాత సోలో హీరోగా బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు.దాంతో దేవర ఫై అంచనాలు భారీగా వున్నాయి.ఆ అంచనాలకు తగ్గేట్లే ఈసినిమానుండి వచ్చిన టీజర్,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక నిన్న కీలకమైన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ముంబై లో ఈవెంట్ జరిపారు.దీనికి ఎన్టీఆర్ తోపాటు డైరెక్టర్ కొరటాల శివ,హీరోయిన్ జాన్వీ కపూర్,విలన్ గా నటించిన సైఫ్ అలీఖాన్ హాజరయ్యారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు కారణంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. దీనిపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో వరద సహాయక చర్యల నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి భారీ విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్‌లో దేవర ట్రైలర్.. ఈ హైలైట్స్ గమనించారా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన మూడు సాంగ్స్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది.

జనక అయితే గనక సెకండ్ సింగిల్ అప్‌డేట్
అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'జనక అయితే గనక'. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలచేసిన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది.

సికిందర్ లో కాజల్ అగర్వాల్
మ్యారేజ్ తరువాత కాజల్ అగర్వాల్ సినిమాలు తగ్గించేసింది.సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ వస్తుంది.రీసెంట్ గా సత్యభామ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది కాజల్.ఇక కొంత గ్యాప్ తరువాత ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది.ఇంతకీ ఆ సినిమా ఏంటంటే…

ప్రభాస్ హను మూవీ షూటింగ్ అప్డేట్
ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు స్టార్ట్ చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్.మాములుగా ఇప్పుడున్న స్టార్ హీరోలు ఒక్క సినిమా చేయడానికి చాలా టైం తీసుకుంటున్నారు కానీ ప్రభాస్ మాత్రం రెస్ట్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఏడాదికి రెండు రిలీజ్ లకు తగ్గకుండా చూసుకుంటున్నాడు.ఇక ప్రభాస్ నెక్స్ట్ సినిమా రీసెంట్ గా లాంచ్ అయిన విషయం తెలిసిందే.

కూలీ షూటింగ్ లో జాయిన్ అయిన నాగ్
సూపర్ స్టార్ రజినీకాంత్ -లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.రీసెంట్ గా ఈసినిమా నుండి పాత్రలను పరిచయం చేశారు.ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడని తెలిసిందే.సైమన్ అనే పాత్రలో కనిపించనున్నాడు నాగ్.గత కొద్దీ రోజుల నుండి ఈసినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఇక ఈ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు నాగార్జున. ఈసినిమాలో తను నెగిటివ్ షేడ్స్ లో కనబడనున్నాని టాక్.దాంతో నాగ్ ను లోకేష్ ఎలా చూపించనున్నాడోని ఫ్యాన్స్ లో ఆసక్తి క్రియేట్ అయ్యింది.

దేవర ట్రైలర్ రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పించిన తారక్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'దేవర'. ఈ అమేజింగ్ సినిమాటిక్ హై యాక్షన్ థ్రిల్లర్ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉండటంతో యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టి సారించింది.

నారా రోహిత్ సుందరకాండ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే వారు అరుదుగా ఉంటుంటారు. అలాంటివారిలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ ఒకరు. 'బాణం' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన అందరి హీరోల్లా కేవలం కమర్షియల్ పంథాలో కాకుండా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

దేవర.. అప్పుడే రికార్డుల వేట మొదలెట్టేశాడు
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'దేవర'. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉండటంతో దేవర టీమ్ ప్రమోషన్స్‌పై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఫియర్, చుట్టమల్లే, దావుడి సాంగ్స్‌కు, టీజర్ విడుదల చేయగా వీటికి ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

తమిళ హీరో శింబు పెద్దమనస్సు.. తెలుగు రాష్ట్రాలకు సాయం
గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు భారీ వరదలు పోటెత్తడంతో రెండు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలు జలమయం అయ్యాయి. అనేకచోట్ల లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో లక్షలాదిమంది ప్రజలు కొన్ని రోజులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు అగ్ర హీరోలు సహా ప్రముఖులు వారిని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు.

ది గోట్ సెన్సేషనల్ రన్ కంటిన్యూ
దళపతి విజయ్ డ్యూయెల్ రోల్ లో నటించిన ది గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం )తమిళ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.తమిళనాడులో నాలుగు రోజుల్లో 100 కోట్లకుపైగా వసూళ్లను సాధించి సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తోంది.ఈసినిమా తెలుగు,హిందీలో కూడా విడుదలకాగా నార్త్ లో 4రోజుల్లో అన్ని వెర్షన్లు కలుపుకుని 13.49కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.

ప్రేమికుడు.. రీ రిలీజ్‌కి సిద్ధం, ఎప్పుడంటే?
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఈ లిస్టు లోకి ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సినిమా చేరింది. సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ 'ప్రేమికుడు' సినిమా త్వరలో రీ-రిలీజ్ అవబోతోంది. 30 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 13న థియేటర్లలో ఘనంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు.

దేవర ప్రమోషన్స్.. స్టార్ డైరెక్టర్స్‌తో ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'దేవర'. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉండటంతో యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి సారించింది. దీనిలో భాగంగా తారక్ ముంబై పయనమై వెళ్లారు. అక్కడ పలువురు సెలబ్రీటీలను కలుసుకుంటున్నారు. సోమవారం 'యానిమల్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగాను కలుసుకున్న విషయం తెలిసిందే.

వేట్టైయాన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్, అదరగొట్టిన సూపర్ స్టార్
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వేట్టైయాన్'. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్ టీజర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసింది. దుషారా విజయన్, రితికా సింగ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రియదర్శి సారంగపాణి జాతకం షూటింగ్ కంప్లీట్
శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో ఇదివరకే 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' లాంటి చక్కటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. తాజాగా వాళ్లిద్దరి కలయికలో యంగ్ హీరో ప్రియదర్శి కథానాయకుడిగా మరో చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు 'సారంగపాణి జాతకం' అనే టైటిల్ ఖరారు చేశారు.

జనక అయితే గనక.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!
టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఈ సినిమాతో మరో హిట్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాను శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి గ్రాండ్‌గా నిర్మించారు.

అక్షయ్ కుమార్ బర్త్ డే.. కన్నప్ప నుంచి ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్‌డేట్ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేయగా.. అవన్నీ మంచి హైప్ క్రియేట్ చేశాయి.

వెంకీ, అనిల్ రావిపూడి మూవీ లేటెస్ట్ అప్‌డేట్
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబోలో మూడో చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది. గత కొన్ని రోజులుగా పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం ఈ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.