మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘దేవర’. ఈ అమేజింగ్ సినిమాటిక్ హై యాక్షన్ థ్రిల్లర్ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉండటంతో యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టి సారించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగా ఫియర్, చుట్టమల్లే, దావుడి సాంగ్స్ మరియు టీజర్ విడుదల చేయగా, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా మంగళవారం సాయంత్రం దేవర థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక అందరూ ఊహించినట్టుగానే ట్రైలర్ అదిరిపోయింది.
2:40 నిమిషాల నిడివి వున్న ఈ ట్రైలర్‌లో తారక్ కనిపించిన తీరు, ఆయన చెప్పిన డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా వున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచాయి. దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ తంగం పాత్రలో డిఫరెంట్‌గా కనిపించింది. ఆమె అందం, అభినయం ఆకట్టుకునేలా వున్నాయి.
జాన్వీ కపూర్‌కి బెస్ట్ టాలీవుడ్ ఎంట్రీగా దేవర నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే జూనియర్‌కి ధీటైన ప్రత్యర్థిగా సైఫ్ అలీఖాన్ కనిపించాడు. క్రూరమైన విలన్‌గా తన గెటప్‌తో సైఫ్ అదరగొట్టేశాడు. ఇక అనిరుధ్ ఇచ్చిన బీజీఎమ్ విజిల్స్ వేయించేలావుంది. మొత్తానికి దేవర ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్నాయి.
కాగా దేవర చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. భైరా అనే ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు.
ఇక ఈ మూవీకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఆర్.రత్నవేలు సినిమాటోగ్రఫీ, సాబు శిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























