మ్యారేజ్ తరువాత కాజల్ అగర్వాల్ సినిమాలు తగ్గించేసింది.సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ వస్తుంది.రీసెంట్ గా సత్యభామ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది కాజల్.ఇక కొంత గ్యాప్ తరువాత ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది.ఇంతకీ ఆ సినిమా ఏంటంటే…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ప్రస్తుతం సౌత్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ తో సికిందర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఇప్పుడు ఓ కీలక పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారు.ప్రస్తుతం జరుగుతున్నషెడ్యూల్ లో కాజల్ కూడా పాల్గొంటుంది.టాప్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్‌వాలా ఈసినిమాను నిర్మిస్తుండగా వచ్చే ఏడాది ఈద్ కు రిలీజ్ కానుంది.ఇక ఈసినిమా విజయం సల్మాన్ కు తప్పనిసరి కానుంది.
గత కొంత కాలంగా సరైన హిట్ లేక రేస్ లో చాలా వెనకబడ్డాడు సల్మాన్ ఖాన్.ఓ పక్క షారుక్ ఖాన్ వరుసగా 1000 కోట్ల క్లబ్ లో చేరి సూపర్ ఫామ్ లోకి రాగ సల్మాన్ కు మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు.దాంతో ఇప్పుడు చేస్తున్న సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.మరి ఈ సికిందర్,సల్మాన్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: